George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జి కురియన్‌ రాజీనామా!

George Kurian: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Arun Chilukuri
Published on: 23 Jun 2026 10:49 AM IST
George Kurian
X

George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జి కురియన్‌ రాజీనామా!

George Kurian: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్‌ (George Kurian) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వ కాలపరిమితి ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కురియన్‌ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించినట్లు మంగళవారం రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో అధికారికంగా ధ్రువీకరించింది.

ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో ఏకైక క్రిస్టియన్ మంత్రిగా ఉన్న జార్జి కురియన్‌ రాజ్యసభ పదవీకాలం జూన్‌ 21తో ముగిసింది. అయితే, ఈసారి భారతీయ జనతా పార్టీ (BJP) ఆయనను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయకపోవడంతో, నిబంధనల ప్రకారం ఆయన తన పదవిని వీడాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఆయన కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖతో పాటు.. కీలకమైన మత్స్య, పాడి, పశుపోషణ శాఖల సహాయ మంత్రిగా కూడా తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.

జార్జి కురియన్‌తో పాటు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మరో కీలక నేత, కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూను కూడా ఈ సారి బీజేపీ అధిష్ఠానం తిరిగి రాజ్యసభకు నామినేట్‌ చేయని విషయం తెలిసిందే. జార్జి కురియన్‌ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో తదుపరి మార్పులు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story