Union Minister Resign: కేంద్ర మంత్రి పదవికి రాజీనామా..!

Union Minister Resign: కేంద్ర రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తన పదవికి రాజీనామా చేశారు.

Naresh.k
Published on: 25 July 2026 8:22 AM IST
Union Minister Resign
X

Union Minister Resign: కేంద్ర మంత్రి పదవికి రాజీనామా..!

avneet Singh Bittu: కేంద్ర రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పంజాబ్ బీజేపీ సీనియర్ నాయకుడు రవ్‌నీత్ సింగ్ బిట్టు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన రాజీనామాను తక్షణమే ఆమోదించారు. ఇటీవల రాజస్థాన్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించిన రాజ్యసభ సభ్యత్వం జూన్‌లో ముగియడంతో, రాజ్యాంగ నియమాల ప్రకారం పార్లమెంట్ సభ్యత్వం లేకపోవడంతో పాటు సొంత రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఢిల్లీ రాజకీయాల్లో దాదాపు 17 ఏళ్ల అనుభవం ఉన్న రవ్‌నీత్ సింగ్ బిట్టు, ఇకపై క్షేత్రస్థాయిలో పంజాబ్ ప్రజలకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఖాళీ చేసిన రాజస్థాన్ స్థానం ద్వారా ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ పదవీకాలం జూన్ 21తో ముగిసింది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ములకు ట్విట్టర్ వేదికగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టమని, రాబోయే రోజుల్లో కూడా వికసిత భారత్, పంజాబ్ అభివృద్ధి సాధనే ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనలో ఉన్న పంజాబ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగే యోచనలో ఉన్న కమల దళం, రవ్‌నీత్ సింగ్ బిట్టును రాష్ట్ర స్థాయి బలమైన నేతగా ముందంజలో ఉంచాలని భావిస్తోంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ మనవడైన బిట్టుకు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉందనే విషయాన్ని బీజేపీ గమనించింది. అందుకే ఆయన ద్వారా అన్ని సామాజిక వర్గాలను ఏకం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

పంజాబ్‌లో సుమారు 58% సిక్కులు, 39% హిందువులు, 32% దళితులు, 16% ఓబీసీ జనాభా అంచనాగా ఉంది. ఈ వర్గాలన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తూ నమ్మకాన్ని పెంచేలా బిట్టు నేతృత్వంలో ప్రచారం సాగనుంది. మేము వీధి వీధి, గ్రామం గ్రామం తిరుగుతూ ప్రధాని మోదీ సైనికులుగా ప్రజల తలుపు తడతాం అని బిట్టు ఇప్పటికే స్పష్టం చేశారు. కేంద్రంలో మంత్రి పదవిని వదులుకుని పంజాబ్ రాజకీయాల్లో అడుగుపెడుతున్న రవ్‌నీత్ సింగ్ బిట్టు, రాబోయే అసెంబ్లీ పోరులో బీజేపీ తరఫున ఎంతటి పాత్ర పోషిస్తారో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story