UP Assembly Elections: యూపీ ఎన్నికల వేళ కీలక నేతలకు భారీ భద్రత.. యోగి, అఖిలేష్, మాయావతిలకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు!

UP Assembly Elections: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్, మాయావతి సహా 52 మంది ప్రముఖ నేతలకు ప్రభుత్వం ₹10 లక్షల విలువైన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు కేటాయించింది.

Arun Chilukuri
Published on: 22 Aug 2026 2:15 PM IST
UP Assembly Elections
X

UP Assembly Elections: యూపీ ఎన్నికల వేళ కీలక నేతలకు భారీ భద్రత.. యోగి, అఖిలేష్, మాయావతిలకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు! 

UP Assembly Elections: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 52 మంది అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు కేటాయించింది.

ఈ భద్రతా కవచం పొందిన వారిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) సుప్రీమో మాయావతి సహా పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, నేతలకు అందించిన ఒక్కో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ విలువ సుమారు ₹10 లక్షలు ఉంటుంది. మొదటి విడతలో 8 మందికి, రెండో విడతలో 44 మందికి వీటిని పంపిణీ చేశారు.

జాకెట్లు పొందిన వారిలో రాష్ట్రానికి చెందిన 11 మంది కేబినెట్ మంత్రులతో పాటు సంజయ్ నిషాద్, నంద్ గోపాల్ గుప్తా 'నంది', ఓం ప్రకాష్ రాజ్‌భర్ మరియు భాజపా నాయకురాలు అపర్ణా యాదవ్ ఉన్నారు. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరొక 98 మంది కీలక నాయకులు, ప్రముఖ వ్యక్తులకు వివిధ కేటగిరీల (X, Y, Z) కింద భద్రతను విస్తరించారు.

మరోవైపు, 2027 ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగుపరుచుకునేందుకు అధికార భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలబలాలు, క్షేత్రస్థాయి అభ్యర్థుల ప్రజాదరణ మరియు స్థానిక అంశాలను అంచనా వేయడానికి భాజపా విస్తృత సర్వేలను ప్రారంభించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story