Viral Video: రీల్స్‌ క్రేజ్.. ప్రాణం తీసిన స్పోర్ట్స్ బైక్: వీడియో కోసం వెనక్కి తిరిగి చూస్తూ...

Viral Video: ఉత్తర్‌ప్రదేశ్‌లో సోషల్ మీడియా రీల్స్ చేస్తూ 19 ఏళ్ల యువతి మృతి చెందింది.

Arun Chilukuri
Published on: 14 April 2026 12:30 PM IST
Viral Video
X

Viral Video: రీల్స్‌ క్రేజ్.. ప్రాణం తీసిన స్పోర్ట్స్ బైక్: వీడియో కోసం వెనక్కి తిరిగి చూస్తూ...

Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఆరాటం ఓ యువతి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. స్పోర్ట్స్ బైక్‌పై ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ, అతివేగంతో వాహనం నడిపి డివైడర్‌ను ఢీకొట్టి ఓ యువతి మరణించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది.

గాజియాబాద్‌కు చెందిన ఇక్రా (19) అనే యువతి తన స్నేహితుడు హసీంతో కలిసి ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై రీల్స్ చేసేందుకు వెళ్ళింది. ఇక్రా వేగంగా స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతుండగా, వెనుక కూర్చున్న హసీం ఆ దృశ్యాలను వీడియో తీస్తున్నాడు. వీడియో కోసం ఇక్రా స్టైల్‌గా వెనక్కి తిరిగిన తరుణంలో బైక్ నియంత్రణ కోల్పోయి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇక్రా మృతి చెందింది. హసీం పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇరువురూ హెల్మెట్‌లు ధరించలేదని పోలీసులు గుర్తించారు.

ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు వారు చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, యువత ప్రాణాల మీదకు తెచ్చే ఇటువంటి సాహసాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story