షాకింగ్: రసగుల్లా తిన్నాడని బాలుడిని తందూరీ పొయ్యిలో పడేశారు!
Rasgulla: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం. రసగుల్లా తిన్నాడని 11 ఏళ్ల బాలుడిని మండుతున్న తందూరీ పొయ్యిలో పడేశాడు ఓ కేటరింగ్ కాంట్రాక్టర్.
షాకింగ్: రసగుల్లా తిన్నాడని బాలుడిని తందూరీ పొయ్యిలో పడేశారు!
Rasgulla: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో పెళ్లి వేడుకలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కేవలం స్వీట్ల కోసం లోపలికి వస్తున్నాడనే కోపంతో, ఒక కేటరింగ్ కాంట్రాక్టర్ 11 ఏళ్ల బాలుడిని మండుతున్న తందూరీ పొయ్యిలో పడేశాడు.
బస్తీ జిల్లా ఛావనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15న ఒక వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు చమన్ (11) అనే బాలుడు తన అమ్మమ్మతో కలిసి హాజరయ్యాడు. వేడుకలో రసగుల్లాలు తింటున్న బాలుడిని చూసి కేటరింగ్ కాంట్రాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాలుడు పదే పదే లోపలికి వస్తున్నాడని కోపంతో ఊగిపోయిన నిందితుడు.. చమన్‌ను అమాంతం ఎత్తుకుని మండుతున్న తందూరీ పొయ్యిపై కూర్చోబెట్టాడు.
భయంతో విలవిల్లాడిన బాలుడు పట్టుతప్పి పొయ్యిలోనే పడిపోయాడు. బాలుడి కేకలు విన్న అతిథులు వెంటనే స్పందించి అతడిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో బాలుడికి ముఖం నుంచి నడుము వరకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితుడు లక్నో మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.




