షాకింగ్ వీడియో: భార్యను బైక్ పైనుంచి తోసేసిన భర్త.. కిరాతకం సీసీటీవీలో రికార్డ్!
Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో దారుణం జరిగింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా, నడుస్తున్న బైక్‌పై నుంచి భార్యను తోసేసి హత్య చేశాడు ఓ కిరాతక భర్త.
షాకింగ్ వీడియో: భార్యను బైక్ పైనుంచి తోసేసిన భర్త.. కిరాతకం సీసీటీవీలో రికార్డ్!
Viral Video: క్షణికావేశం, వరకట్న దాహం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పుట్టినరోజు వేడుకల్లో సరదాగా గడపాల్సిన దంపతుల మధ్య తలెత్తిన చిన్న వివాదం.. చివరకు హత్యకు దారితీసింది. బైక్‌పై వెళ్తుండగా భార్యను కదులుతున్న వాహనం నుంచి కిందకు తోసేసి భర్త దారుణానికి ఒడిగట్టాడు.
అసలేం జరిగిందంటే?
యూపీలోని రాంపూర్‌కు చెందిన విశాల్‌కు, జామ్ నగర్‌కు చెందిన ఆర్తికి గత ఫిబ్రవరి 25న అట్టహాసంగా వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నాటి నుంచే అదనపు కట్నం కోసం ఆర్తిని భర్త, అత్తమామలు వేధిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మార్చి 25న ఒక పుట్టినరోజు వేడుకకు వెళ్లిన దంపతుల మధ్య డాన్స్ చేసే విషయంలో గొడవ జరిగింది. పార్టీ ముగించుకుని తిరిగి బైక్‌పై వస్తుండగా మార్గమధ్యలో కూడా వీరి మధ్య వాగ్వాదం కొనసాగింది.
ప్లాన్ ప్రకారమే హత్య?
తీవ్ర ఆగ్రహానికి లోనైన విశాల్, హైవేపై బైక్ వేగంగా వెళ్తుండగా వెనుక కూర్చున్న ఆర్తిని ఒక్కసారిగా పక్కకు తోసేశాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై రోడ్డుపై పడిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. తొలుత ఇది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, సీసీటీవీ ఫుటేజీ అసలు నిజాన్ని బయటపెట్టింది.
సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు:
పోలీసులు సేకరించిన సీసీటీవీ దృశ్యాల్లో విశాల్ ప్లాన్ ప్రకారమే ఆర్తిని తోసేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె కింద పడగానే బైక్ ఆపి, ఆమెను పక్కకు కూర్చోబెట్టి ఏమీ తెలియనట్లు అటు ఇటు తిరుగుతూ నాటకమాడాడు.
కేసు నమోదు:
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లి సమయం నుంచి వరకట్నం కోసం తన కూతురిని హింసించారని, పక్కా పథకం ప్రకారమే చంపేశారని ఆయన ఆరోపించారు. తండ్రి ఫిర్యాదు మరియు సీసీటీవీ ఆధారాలతో నిందితుడు విశాల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




