Divya Mittal: యూపీలో సంచలనం సంచలనం సృష్టించిన ఐఏఎస్ దివ్యా మిత్తల్ రాజీనామా!
Divya Mittal: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిత్తల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
Divya Mittal: యూపీలో సంచలనం సంచలనం సృష్టించిన ఐఏఎస్ దివ్యా మిత్తల్ రాజీనామా!
Divya Mittal: ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిత్తల్ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎలాంటి వ్యక్తిగత కారణాలు చెప్పకుండా, పూర్తిగా స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ ఫైల్ వెనుక ఒక మనిషి జీవితం ఉంటుందని, సమాజం నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని ఆమె తన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నారు.
"సమాజానికి నేనేదో ఇవ్వడానికి ఐఏఎస్‌గా వచ్చానని అనుకున్నా.. కానీ నా నుంచి తీసుకున్నదానికంటే నేనే వారికీ ఎంతో ఎక్కువుగా నేర్చుకున్నాను" అంటూ దివ్యా మిత్తల్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
ఐఐటీ దిల్లీ , ఐఐఎం బెంగళూరులలో ఉన్నత విద్యను పూర్తి చేసిన దివ్యా మిత్తల్.. లండన్‌లో అత్యున్నత ఆర్థిక నిపుణురాలిగా పనిచేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలి స్వదేశానికి వచ్చారు. సివిల్ సర్వీసెస్ సాధించి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.
గత 13 ఏళ్ల సర్వీస్‌లో యూపీలోని దేవరియా, సంత్‌కబీర్ నగర్, మిర్జాపుర్‌లలో జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. ముఖ్యంగా మిర్జాపుర్ కలెక్టర్‌గా ఆమె చేసిన అభివృద్ధి పనులు ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా చేశాయి. మారుమూల కొండ ప్రాంత పల్లెలకు కూడా పైప్‌లైన్ల ద్వారా తాగునీరు అందించిన ఘనత ఆమెది.
మిర్జాపుర్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఆమెను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయడంతో స్థానిక ప్రజలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. కొంతకాలం పోస్ట్ రానప్పటికీ.. ఆ తర్వాత యూపీ గ్రామీణ రహదారుల సంస్థ సీఈవోగా, రాజీనామా చేసే సమయానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
తన రాజీనామా ప్రకటనలో "ఇప్పుడు ప్రజల కోసం కంటున్న కలలు సాకారం చేయాల్సిన సమయం వచ్చింది" అని పేర్కొనడంతో ఆమె తదుపరి అడుగు ఏమిటన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, పుస్తక రచన మరియు విద్యా రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు తెలిపారు.




