Bizarre Love Triangle: ఉత్తమ ఇల్లాలు .. పగలు ప్రియుడు.. రాత్రి భర్త... ఇద్దరితో కలిసి ఉంటా!
Bizarre Love Triangle: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఓ వివాహిత తన భర్త, ప్రియుడు ఇద్దరితో ఒకే ఇంట్లో కలిసి ఉండేందుకు 'డ్యూటీ రోస్టర్' తయారు చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Bizarre Love Triangle: ఉత్తమ ఇల్లాలు .. పగలు ప్రియుడు.. రాత్రి భర్త... ఇద్దరితో కలిసి ఉంటా!
UP Woman: సాధారణంగా ఆఫీసుల్లో ఉద్యోగులకు, ఆసుపత్రుల్లో వైద్యులకు ‘డ్యూటీ రోస్టర్’ ఉండటం మనకు తెలిసిందే. కానీ ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ వివాహిత, తన భర్తతో పాటు ప్రియుడితోనూ ఒకే ఇంట్లో కలిసి ఉండేందుకు ఏకంగా ఒక ‘డ్యూటీ రోస్టర్’ తయారు చేసి పోలీసుల ముందుకు తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా మహమూదాబాద్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ విచిత్ర ఉదంతం ఇప్పుడు స్థానికంగానే కాకుండా, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
మహమూదాబాద్లోని ఫుల్వారీపూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి భార్యకు, కొంతకాలం క్రితం మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, గత మార్చి 21న ఆమె ఓ ఆలయంలో ప్రియుడిని రహస్యంగా వివాహం చేసుకుంది.
ఈ విషయం తెలిసిన ఆమె పుట్టింటి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూతురితో సంబంధాలు తెంచుకున్నారు. అయితే ఆ మహిళ మాత్రం తన భర్తను గానీ, ప్రియుడిని గానీ ఎవరినీ వదులుకోవడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పింది. ఇద్దరితోనూ ఒకేసారి కలిసి ఉండేందుకు ఒక వింత పరిష్కారాన్ని రూపొందించింది.
ఆ మహిళ రూపొందించిన టైమ్‌టేబుల్ ప్రకారం.. పగటిపూట ప్రియుడు తనతో, పిల్లలతో కలిసి ఉంటాడు. ఇక రాత్రిపూట భర్త తనతో ఉంటాడని ఆమె స్పష్టమైన షెడ్యూల్ సిద్ధం చేసింది. అంతటితో ఆగకుండా, తన భర్త మరియు ప్రియుడు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని కోరుతూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
ఈ వ్యవహారంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. భార్య పెట్టిన ఈ విచిత్ర ప్రతిపాదనకు భర్త నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోవడం. పైగా, తన భార్య ప్రియుడిని సొంత సోదరుడిలా భావిస్తూ ఈ ఏర్పాటుకు అంగీకరించాడు. తన భార్యను గానీ, ఆమె ప్రియుడిని గానీ వదులుకోలేనని, కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే అందరం కలిసి ఇల్లు వదిలి వెళ్లడానికైనా సిద్ధమని భర్త చెబుతుండటం గమనార్హం.
భర్త ఈ బంధానికి అంగీకరించినప్పటికీ, అత్తమామలు మరియు ఇతర కుటుంబ సభ్యులు మాత్రం ఈ వింత ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంట్లో ఈ విషయంపై గొడవ పెద్దది కావడంతో.. శుక్రవారం ఆ మహిళ తన ఇద్దరు పిల్లలు, భర్త, ప్రియుడితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.
ఆమె చెప్పిన విషయాలు, చేతిలో ఉన్న డ్యూటీ రోస్టర్ చూసి పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. రాత్రి పొద్దుపోయే వరకు ఆ ముగ్గురితో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా, ఆ మహిళ మాత్రం ఇద్దరితోనూ కలిసి ఉంటానని భీష్మించుకుని కూర్చుంది. ఈ విచిత్ర కేసును ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.




