Uttarakhand: డ్రగ్స్ మాఫియాపై మహిళల యుద్ధం.. అర్ధరాత్రి చేతుల్లో కర్రలతో కాపలా!

Uttarakhand: దేహ్రాదూన్ సమీపంలోని థానీ గ్రామంలో మాదకద్రవ్యాల విక్రయాలను అడ్డుకునేందుకు మహిళలు కర్రలు పట్టి వీధుల్లో కాపలా కాస్తున్నారు.

Arun Chilukuri
Published on: 26 Aug 2026 10:07 AM IST
Uttarakhand
X

Uttarakhand: డ్రగ్స్ మాఫియాపై మహిళల యుద్ధం.. అర్ధరాత్రి చేతుల్లో కర్రలతో కాపలా!

Uttarakhand: యువతను పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారి పట్టణాల నుంచి గ్రామాలకూ పాకింది. ఈ పరిస్థితిని చూసి సహించలేని ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్ సమీప ముస్సోరి రోడ్డులోని థానీ గ్రామ మహిళలు స్వయంగా రంగంలోకి దిగారు. తమ పిల్లలను ఈ వ్యసనం బారిన పడకుండా కాపాడుకునేందుకు వినూత్నంగా పోరాటం ప్రారంభించారు.

దాదాపు 350 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో గత ఏడేళ్లుగా బయటి వ్యక్తులు, విద్యార్థులు రాత్రి వేళల్లో వాహనాలపై వచ్చి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. పోలీసులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో, ఊళ్లోని 30 మందికి పైగా మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు చేతుల్లో కర్రలు, టార్చ్‌లైట్లు, సెల్‌ఫోన్లతో వీధుల్లో పహారా కాస్తూ డ్రగ్స్ విక్రేతలకు సింహస్వప్నంగా మారారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story