DK Shivakumar: కర్ణాటక ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' తొలి రెండు చరణాలే.. డీకే శివకుమార్ స్పష్టం!

DK Shivakumar: కర్ణాటక ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' తొలి రెండు చరణాలు మాత్రమే ఆలపిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 26 Aug 2026 1:14 PM IST
DK Shivakumar
X

DK Shivakumar: కర్ణాటక ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' తొలి రెండు చరణాలే.. డీకే శివకుమార్ స్పష్టం!

DK Shivakumar: కర్ణాటకలో జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించడంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించబోమని, కేవలం తొలి రెండు చరణాలు మాత్రమే పాడతామని స్పష్టం చేశారు.

"1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) తీసుకున్న ప్రతిపాదనల ప్రకారమే బహిరంగ, జాతీయ వేదికలపై మొదటి రెండు చరణాలు మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి నేను పూర్తి బాధ్యతతో కట్టుబడి ఉంటాను" అని డీకే శివకుమార్ తేల్చి చెప్పారు.

గతంలో జరిగిన ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరం మొత్తం ఆరు చరణాలు ఆలపించడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనకు తెలియకుండానే ఆ నిర్ణయం జరిగి ఉండవచ్చని, ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని ఆయన వివరణ ఇచ్చారు.

వందేమాతరం గేయంలోని తరువాతి చరణాల్లో హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి, సరస్వతి దేవుళ్ల ప్రస్తావన వస్తుందని, భారత్ అనేది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం కాబట్టి ఇతర మతస్తులు లేదా వర్గాల భావోద్వేగాలను గౌరవించడానికే మొదటి రెండు చరణాలకే పరిమితం అవుతున్నామని కాంగ్రెస్ సమర్థించుకుంది.

కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా విరుచుకుపడింది. జాతీయ గేయాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే దేశభక్తికి సంబంధించిన అంశాలలో ఇటువంటి సవరణలు చేస్తోందని మండిపడింది.

మొత్తం చరణాలు ఆలపించేలా నూతనంగా 'వందేమాతరం బిల్లు' తీసుకురావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వ వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయి రాజకీయ మాటల యుద్ధానికి దారితీశాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story