Vijay: విజయ్ సీఎం పదవి మూడ్నాళ్ల ముచ్చటే..తేల్చేసిన వేణుస్వామి
Vijay: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తమిళనాడు, బెంగాల్ రాజకీయాలపై సంచలన జోస్యం చెప్పారు.
Vijay: విజయ్ సీఎం పదవి మూడ్నాళ్ల ముచ్చటే..తేల్చేసిన వేణుస్వామి
Venu Swamy: సినిమా తారలు, రాజకీయ దిగ్గజాల జాతకాలను విశ్లేషించడంలో వేణుస్వామి స్టైలే వేరు. గతంలో జాతకాలు చెప్పడం మానేస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆయన, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తదనంతర పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు అంతకు మించి షాక్ ఇస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై వేణుస్వామి జోస్యం విచిత్రంగా ఉంది. అక్కడ బీజేపీ ఘనవిజయం సాధించినప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ సంక్షోభం తలెత్తి అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభించిన దళపతి విజయ్ గురించి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ , త్రిషలది ఏకనాడి కాంబినేషన్ అని, ఒకవేళ త్రిష మద్దతు లేకపోయి ఉంటే విజయ్ కి ఎన్నికల్లో ఈ స్థాయి ఫలితం వచ్చేది కాదని జాతక రీత్యా విశ్లేషించారు. విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటికీ, ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్ర జాతకం మరియు గ్రహ గతుల రీత్యా.. ఆరు నెలల నుంచి ఏడాది లోపు అక్కడ మళ్లీ ఎన్నికలు రావడం ఖాయమని బాంబు పేల్చారు
పెను సంచలనాలు
మే 25 నుంచి జూన్ 2 వరకు జరిగే గురువు మార్పు దేశ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతమని వేణుస్వామి తెలిపారు. గురువు మిథున రాశి నుంచి కర్కాటక, సింహ రాశుల్లోకి ప్రవేశించి అతిచారంలోకి వెళ్లడం వల్ల రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని వివరించారు. ఈ గ్రహాల కదలిక వల్లే బెంగాల్, తమిళనాడులో ప్రస్తుతం ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా, వేణుస్వామి చెప్పినట్టుగా నెల రోజుల్లో లేదా ఏడాది లోపు ఈ సంచలనాలు నిజమవుతాయా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అటు దళపతి అభిమానులు, ఇటు రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.




