సాంకేతిక కారణాలతో నిలిచిన 'విక్రమ్-1' కౌంట్‌డౌన్.. సమయాన్ని మార్చిన శాస్త్రవేత్తలు!

Sriharikota: శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరగాల్సిన 'విక్రమ్-1' ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణాల దృష్ట్యా స్వల్పంగా ఆలస్యమైంది.

KKV Sudhakar, Sullurupeta
Published on: 18 July 2026 12:19 PM IST
Sriharikota
X

సాంకేతిక కారణాలతో నిలిచిన 'విక్రమ్-1' కౌంట్‌డౌన్.. సమయాన్ని మార్చిన శాస్త్రవేత్తలు!

శ్రీహరికోట: దేశీయ అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు స్కైరూట్ ఏరోస్పేస్ సిద్ధమైంది. ప్రతిష్టాత్మక 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాస్తవానికి ఉదయం 11:35 గంటలకు జరగాల్సిన ఈ ప్రయోగం, సాంకేతిక కారణాల దృష్ట్యా కొంత సమయం పాటు కౌంట్‌డౌన్ హోల్డ్ అయ్యింది.

​ప్రయోగం తుది దశలో కౌంట్‌డౌన్ నిలిచిపోవడంతో అంతరిక్ష కేంద్రంలో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే, శాస్త్రవేత్తలు వెంటనే అప్రమత్తమై ఐదు నిమిషాల పాటు పరిస్థితిని విశ్లేషించారు. సమస్యకు గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన సాంకేతిక సమీక్షలు పూర్తి చేశారు. అనంతరం ప్రయోగ సమయాన్ని 20 నిమిషాలు పొడిగిస్తూ, మధ్యాహ్నం 12:05:30 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు తాజాగా ప్రకటించారు.

​భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌గా గుర్తింపు పొందనున్న విక్రమ్-1 ప్రయోగంపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్ష పరిశోధనారంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశం మరింత వేగవంతం కావడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారత్ సత్తా చాటినట్లవుతుంది. ప్రస్తుతం అన్ని వ్యవస్థలు సాధారణ స్థితికి చేరుకున్నాయని, నిర్ణీత సమయంలోనే విక్రమ్-1 గగనతలం వైపు దూసుకెళ్తుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గట్టి భద్రత మరియు పర్యవేక్షణ మధ్య ఈ అద్భుత ఘట్టం కోసం దేశం మొత్తం వేచి చూస్తోంది.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story