Paralakhemundi: జగన్నాథ మందిర ద్వార బంధాలకు ఘన స్వాగతం పర్లాఖెముండి!

Paralakhemundi: పర్లాఖెముండిలో నూతనంగా నిర్మిస్తున్న జగన్నాథ మందిర ద్వార బంధాలకు ఘన స్వాగతం. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి.

S.Anil, Gajapati Dst
Published on: 13 Sept 2026 1:25 PM IST
Paralakhemundi
X

Paralakhemundi: జగన్నాథ మందిర ద్వార బంధాలకు ఘన స్వాగతం పర్లాఖెముండి!

Paralakhemundi: పర్లాఖెముండి గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని రాజా వీధిలో నూతనంగా నిర్మిస్తున్న జగన్నాథ మందిర పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మందిరం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన నాలుగు ద్వార బంధాలను భక్తులు ఘనంగా స్వాగతం పలికారు.

గజపతి జిల్లా సరిహద్దు ప్రాంతమైన లావణ్య గడ వద్దా జగన్నాథ మందిర కమిటీ సభ్యులతో పాటు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి సంకీర్తనలతో ద్వారా బంధాలకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గుసాని సమితిలోని పలు గ్రామాల వెంట ఉత్సవముగా తిప్పుకుంటూ మందిర వద్దకు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హర్యానా నుండి తెచ్చిన సామాగ్రితో కటక్‌ లో తయారు చేసిన నాలుగు ద్వార బంధాలకు పూజలు జరపడం ఎంతో సంతోషంగా ఉందని, అదేవిధంగా జిల్లా ప్రజలకు చూపించుకుంటూ ఉత్సవంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఆలయ కమిటీ సభ్యుడు దుర్గామాదవ్ పాణిగ్రాహి మాట్లాడుతూ సుమారు రూ కోటి రూపాయల వ్యయంతో ఈ ద్వార బంధాలు నిర్మాణం జరిగిందని, ముఖ్యంగా మందిర నిర్మాణానికి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి రూ 50 లక్షలు నిధులను ఈ ద్వారా బంధాలకి ఉపయోగించినట్లు తెలిపారు. భక్తులు సంకీర్తనలతో సందడిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst