Gas Leak : మరో ఘోరం.. ఐస్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్.. 25 మందికి అస్వస్థత

Gas Leak : పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆదివారం రాత్రి ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. హడోవా పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపుకూర్ ఏరియాలో

G Krishna
Published on: 24 Aug 2026 10:15 AM IST
Gas Leak
X

Gas Leak

Gas Leak : పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆదివారం రాత్రి ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. హడోవా పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపుకూర్ ఏరియాలో ఉన్న ఒక ఐస్ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదవశాత్తు అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ పాయిజనస్ గ్యాస్ గాలిలో వేగంగా వ్యాపించడంతో, పక్కనే ఉన్న ఊరిలోని పిల్లలు, మహిళలతో కలిపి దాదాపు 25 మందికి పైగా విపరీతంగా అస్వస్థతకు గురయ్యారు. ఈ సడెన్ గ్యాస్ లీకేజ్ వల్ల ఆరియాలో ఒక్కసారిగా పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ అయింది.

రాత్రికి రాత్రే ఊపిరాడక జనం అల్లకల్లోలం

స్థానికులు చెప్పిన దాని ప్రకారం, ఆదివారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఐస్ ఫ్యాక్టరీ నుండి హఠాత్తుగా అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. కొద్ది నిమిషాల్లోనే ఆ గ్యాస్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి పాకేసింది. గాలిలో గ్యాస్ ఘాటు ఎక్కువైపోవడంతో చాలా మందికి కళ్లు మండటం, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ప్రాబ్లమ్స్ రావడం మొదలయ్యాయి. ఊపిరాడక చాలా మంది చిన్నపిల్లలు, మహిళలు స్పృహతప్పి పడిపోవడంతో స్థానికులు వెంటనే హడోవా రూరల్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

స్పాట్‌కి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది

విషయం తెలిసిన వెంటనే హడోవా పోలీస్ స్టేషన్ పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ టీమ్స్ హుటాహుటిన స్పాట్‌కి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది చాలా కష్టపడి గ్యాస్ లీకేజ్‌ని కంట్రోల్‌లోకి తీసుకొచ్చారు. ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ లోపం వల్ల ఈ లీకేజ్ జరిగిందా లేక ఏదైనా టెక్నికల్ ఫెయిల్యూర్ ఉందా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.

రోడ్డెక్కి టైర్లు తగలబెట్టిన పబ్లిక్.. ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలని డిమాండ్

ఈ యాక్సిడెంట్ తర్వాత లోకల్ పీపుల్ ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ వైఖరిపై తీవ్రమైన కోపంతో రగిలిపోయారు. ఈ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అవ్వడం ఇది మొదటిసారి కాదని, పదేపదే ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల తమ ప్రాణాలకు రిస్క్ ఏర్పడుతోందని ఆరోపించారు. ఫ్యాక్టరీని పర్మనెంట్‌గా క్లోజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా బెడచంప-హడోవా మెయిన్ రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. రోడ్డుపై టైర్లను తగలబెట్టి ట్రాఫిక్‌ను బ్లాక్ చేసి నిరసన తెలపడంతో ఆ ఏరియాలో కాసేపు టెన్షన్ అట్మాస్ఫియర్ నెలకొంది. భవిష్యత్తులో ఇలాంటి లైఫ్ త్రెటనింగ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఫ్యాక్టరీ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వెంటనే సీల్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story