West Bengal: తృణమూల్‌లో తిరుగుబాటు? దీదీ మీటింగ్‌కు ఎమ్మెల్యేల గైర్హాజరు..!

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం. ఎన్నికల ఓటమి తర్వాత మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు. దీదీ నాయకత్వంపై అసంతృప్తి నెలకొందా? టీఎంసీ వివరణ ఏంటి?

Arun Chilukuri
Published on: 7 May 2026 2:07 PM IST
Mamata Banerjee
X

West Bengal: తృణమూల్‌లో తిరుగుబాటు? దీదీ మీటింగ్‌కు ఎమ్మెల్యేల గైర్హాజరు..!

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి కుదిపేస్తున్నాయి. ఎన్నికల ఓటమి తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని మమతా బెనర్జీ (దీదీ) భీష్మించుకోవడంతో రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమె నిర్వహించిన కీలక సమావేశానికి ఎమ్మెల్యేలు ముఖం చాటేయడం తృణమూల్ కాంగ్రెస్‌లో (TMC) ప్రకంపనలు సృష్టిస్తోంది.

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరుణంలో పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు, భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేసేందుకు మమతా బెనర్జీ ఒక కీలక భేటీని ఏర్పాటు చేశారు. టీఎంసీ తరపున 80 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, ఈ సమావేశానికి కేవలం 70 మంది మాత్రమే హాజరయ్యారు. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యేలు రాకపోవడంతో పార్టీలో చీలిక రాబోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలను తృణమూల్ వర్గాలు కొట్టిపారేశాయి. వ్యక్తిగత కారణాల వల్ల వారు రాలేకపోయారని, ఆ విషయంపై వారు ముందుగానే పార్టీకి సమాచారం ఇచ్చారని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ, ఓటమి భారంలో ఉన్న పార్టీకి ఈ గైర్హాజరు గట్టి దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story