Mamata Banerjee: ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం! ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయడంతో, తన ఓటమిని అంగీకరిస్తూ మమతా బెనర్జీ తన ఎక్స్ (ట్విట్టర్) బయోని మార్చుకున్నారు.
Mamata Banerjee: ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఎట్టకేలకు మమతా బెనర్జీ తన పరాజయాన్ని అంగీకరించారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం కొలువుదీరడం, నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయడంతో దీదీ తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో మార్పులు చేశారు.
ఎన్నికల ఫలితాల తర్వాత అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మమతా బెనర్జీ తొలుత రాజీనామాకు నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే మే 7వ తేదీతో అసెంబ్లీ గడువు ముగియడం, గవర్నర్ ఆర్.ఎన్. రవి సభను రద్దు చేయడంతో రాజకీయ చిత్రం మారిపోయింది. తాజాగా సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆమె తన పరాజయాన్ని స్పష్టం చేస్తూ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) బయోని అప్‌డేట్ చేశారు.
గతంలో తన బయోలో ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి’ అని ఉన్న హోదాను ఇప్పుడు ‘అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ విధానసభ)’ గా మార్చుకున్నారు. అంటే, తాను గత మూడు పర్యాయాలు మాత్రమే సీఎంగా పనిచేశానని పేర్కొంటూ, ప్రస్తుత బాధ్యతల నుండి తప్పుకున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు.
బీజేపీ సర్కారు కొలువుదీరడంతో బెంగాల్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా కొనసాగిన తృణమూల్ కాంగ్రెస్ ప్రాబల్యానికి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లయింది.




