కోల్‌కతాలో అర్ధరాత్రి హైడ్రామా.. తృణమూల్ ఆఫీసుపైకి దూసుకెళ్లిన బుల్డోజర్..
Kolkata: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హాగ్ మార్కెట్‌లోని టీఎంసీ ఆఫీసును బుల్డోజర్‌తో కూల్చివేయడం సంచలనంగా మారింది.
కోల్‌కతాలో అర్ధరాత్రి హైడ్రామా.. తృణమూల్ ఆఫీసుపైకి దూసుకెళ్లిన బుల్డోజర్..
Kolkata: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ హింస ఒక్కసారిగా పేలింది. కోల్‌కతా నడిబొడ్డున మంగళవారం అర్ధరాత్రి తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ కార్యాలయంపైకి బుల్డోజర్ దూసుకెళ్లిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. న్యూమార్కెట్ యూనియన్ ఆఫీసును గుర్తుతెలియని వ్యక్తులు బుల్డోజర్‌తో పూర్తిగా ధ్వంసం చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
హాగ్ మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఈ దాడి సమయంలో దుండగుల చేతుల్లో బీజేపీ, ఆరెస్సెస్ జెండాలు ఉండటం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ దృశ్యాలను టీఎంసీ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేస్తూ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడింది. "బీజేపీ పరివర్తన్ బుల్డోజర్‌తో మొదలైంది.. రేపు రాజకీయ ప్రత్యర్థుల ప్రాణాలను కూడా వదిలిపెట్టరేమో" అంటూ ఘాటుగా విమర్శించింది.
కేవలం కోల్‌కతాలోనే కాకుండా బిజోయ్‌గఢ్, పానిహటీ వంటి ప్రాంతాల్లోనూ టీఎంసీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. ముఖ్యంగా ఆర్‌జీకర్ బాధితురాలి తల్లి విజయం సాధించిన పానిహటీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని, హింసకు పాల్పడే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు.




