Porsche car: పోర్షే కారుపై సిమెంట్ కలిపి గుంతలు పూడ్చిన ఘనుడు.. ఎందుకో తెలుసా?

Porsche car: బెంగళూరులో ఒక వ్యాపారి తన రూ. 2 కోట్ల పోర్షే కారుపై సిమెంట్ కలిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Naresh.k
Published on: 22 April 2026 9:49 AM IST
Porsche car
X

Porsche car: పోర్షే కారుపై సిమెంట్ కలిపి గుంతలు పూడ్చిన ఘనుడు.. ఎందుకో తెలుసా?

Porsche car: సిలికాన్ వ్యాలీ బెంగళూరు అనగానే ట్రాఫిక్ కష్టాలు, అధ్వాన్నమైన రోడ్లు గుర్తొస్తాయి. అయితే, ఈ రోడ్ల మీద విసుగు చెందిన ఒక వ్యాపారి తన ఖరీదైన కారునే సిమెంట్ కలిపే గంపగా మార్చేశాడు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం. అఖిల్ హేమాద్రి అనే వ్యాపారి తన రెండు కోట్ల రూపాయల విలువైన పోర్షే కారు బ్యానెట్‌పై సిమెంట్, ఇసుక పోసి కలుపుతున్న వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. రోడ్ల మీద ఉన్న గుంతలను పూడ్చేందుకు ఆయన ఈ సాహసం చేశాడు. అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన అని అందరూ అనుకుంటుండగా.. ఈ హై-వోల్టేజ్ డ్రామా వెనుక ఉన్న అసలు సీక్రెట్ బయటపడింది.

నిరసనా? ప్రమోషనా?

కారు బ్యానెట్‌పై సిమెంట్ కలిపిన అఖిల్, ఆ తర్వాత ఆ మిశ్రమంతో రోడ్డు మీద ఉన్న గుంతను పూడ్చేశాడు. అయితే, ఇది కేవలం రోడ్ల మీద ఉన్న గుంతల గురించి మాత్రమే కాదు, తన కంపెనీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునే పీఆర్ స్టంట్ అని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన కారుకు వేసిన పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ నాణ్యత ఎంత బలంగా ఉందో చూపడమే తన ప్రధాన ఉద్దేశ్యమని అతడు తెలిపాడు. సిమెంట్ పని పూర్తయ్యాక, కారు బ్యానెట్‌పై ఉన్న ప్రొటెక్టివ్ షీట్‌ను తొలగించగా.. కారు పెయింట్ ఏమాత్రం దెబ్బతినకుండా మెరుస్తూ కనిపించింది.

ప్రభుత్వంపై సెటైర్

ప్రతిదానికీ ప్రభుత్వంపై ఆధారపడకుండా, పౌరులుగా మన పరిసరాలను మనమే బాగు చేసుకోవాలి అంటూ అఖిల్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గతంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరులో గుంతలే లేవు, అదంతా సోషల్ మీడియా సృష్టే అని చేసిన వ్యాఖ్యలను ఈ వీడియో పరోక్షంగా ఎండగట్టినట్లయింది.

నెటిజన్ల రియాక్షన్

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆయన చేసిన వినూత్న ప్రచారాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ప్రచారం కోసం కారును ఇలా వాడాలా? అని విమర్శిస్తున్నారు. విమర్శలు ఎక్కువవ్వడంతో అఖిల్ తన వీడియో కామెంట్లను డిసేబుల్ చేయడం గమనార్హం. కారణం ప్రమోషన్ అయినా, నిరసన అయినా.. ఒక విలాసవంతమైన కారును ఇలా సిమెంట్ కలపడానికి వాడటం అనేది బెంగళూరు రోడ్ల దుస్థితిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

Naresh.k

Naresh.k

Next Story