Indian Railway: ట్రైన్ కోచ్‌లు వేర్వేరు రంగుల్లో ఎందుకుంటాయి? వాటి వెనుక అసలు అర్ధం ఇదే
Indian Railway: భారతీయ రైల్వేలో ట్రైన్ బోగీలు ఎందుకు వేర్వేరు రంగుల్లో ఉంటాయో మీకు తెలుసా? ప్రతి రంగుకు ఒక ప్రత్యేక అర్థం, ఉద్దేశ్యం ఉంది. వాటి వివరాలు ఇక్కడ చూడండి.
Indian Railway: ట్రైన్ కోచ్‌లు వేర్వేరు రంగుల్లో ఎందుకుంటాయి? వాటి వెనుక అసలు అర్ధం ఇదే
Indian Railway: మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని బోగీలు నీలం రంగులో, కొన్ని ఆకుపచ్చ రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉండటాన్ని గమనిస్తాం. అసలు ఇన్ని రకాల రంగులు ఎందుకు.? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో చాలామందికి తెలియదు. కేవలం చూడటానికి అందంగా కనిపించడమే కాకుండా, ప్రతి రంగు ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని లేదా ఆ బోగీ ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది.
సాధారణంగా మనం చూసే నీలం రంగు బోగీలు స్లీపర్ క్లాస్, జనరల్ కోచ్‌లకు కేటాయిస్తారు. ఒకప్పుడు ఎక్కువగా కనిపించే మెరూన్ రంగు బోగీలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాటి స్థానంలో ఇప్పుడు నీలం రంగు కోచ్‌లను ప్రవేశపెట్టారు.
ఇక తక్కువ ధరలో మంచి ఏసీ సౌకర్యాలను అందించే గరీబ్‌రథ్ లాంటి ప్రత్యేక రైళ్లకు ఆకుపచ్చ రంగును ఉపయోగిస్తారు. అలాగే, ప్రీమియం ఎయిర్-కండిషన్డ్ బోగీలకు ఎరుపు రంగును కేటాయించారు. ఏదైనా కోచ్‌పై పసుపు రంగు చారలు ఉంటే, అవి సాధారణ ప్రయాణికుల కోసం కాకుండా పార్శిల్ లాంటి ఇతర సేవల కోసం ఉపయోగించే కోచ్‌లు అని మనం అర్థం చేసుకోవాలి. రంగుల ద్వారా రైల్వే శాఖ ప్రయాణికులకు సులభంగా అర్థమయ్యేలా ఒక కోడ్‌ను రూపొందించింది. దీనివల్ల మనకు కావాల్సిన బోగీని ప్లాట్‌ఫామ్ మీద సులభంగా గుర్తించవచ్చు. ఇలాంటి చిన్న విషయాలు మన ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.




