Extra marital affair: ప్రియుడి మోజులో పడి భర్త మర్మాంగానికి కరెంట్ షాకిచ్చి చంపిన భార్య!
Extra marital affair: ఢిల్లీలోని సంగమ్ విహార్‌లో దారుణం జరిగింది. 20 ఏళ్ల ప్రియుడి మోజులో పడి రూ.5 లక్షల ఆఫర్‌తో భర్తను కిరాతకంగా హత్య చేయించింది ఓ భార్య.
Extra marital affair: ప్రియుడి మోజులో పడి భర్త మర్మాంగానికి కరెంట్ షాకిచ్చి చంపిన భార్య!
Wife kill husband: పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. కట్టుకున్న భర్తను, ముగ్గురు పిల్లల తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేయించింది ఒక భార్య. ఆపై తనకు ఏమీ తెలియనట్లు నాటకాలాడుతూ.. పక్కా ప్లాన్‌తో దొంగతనం సీన్ క్రియేట్ చేసింది. కానీ, సీసీటీవీ కెమెరా సాక్ష్యంతో పోలీసులు ఆమె ముసుగు తొలగించారు. దేశ రాజధాని ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘోరం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఢిల్లీలోని సంగమ్ విహార్‌కి చెందిన మున్నా లాల్ (55) రియల్ ఎస్టేట్ డీలర్‌గా పనిచేస్తూ ఆర్థికంగా బాగానే స్థిరపడ్డాడు. అతడికి భార్య మంజు (45) అలియాస్ నజియా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అంతా సజావుగానే సాగుతోందనుకున్న సమయంలో.. నజియాకు ఇంటి పక్కనే ఉండే 20 ఏళ్ల మెకానిక్ చమన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
తన కంటే వయసులో చాలా చిన్నవాడైన ప్రియుడు చమన్ తో నిత్యం గడపాలనే పిచ్చి వ్యామోహంలో నజియా మునిగిపోయింది. భర్త అడ్డు తొలగించుకుంటే ఆస్తితో పాటు హాయిగా జీవించవచ్చని భావించింది. నా భర్తను చంపేస్తే నీకు రూ. 5 లక్షలు ఇస్తాను.. ఆ తర్వాత ఇద్దరం హాయిగా ఉందాం అని ప్రియుడికి ఆఫర్ ఇచ్చి దారుణ హత్యకు ప్లాన్ వేసింది.
కుమారుడు కన్వర్ యాత్ర కోసం బయటకు వెళ్లడంతో, ఇంట్లో మరెవరూ లేని సమయాన్ని నజియా పక్కాగా వాడుకుంది. ఆగస్టు 10న ప్లాన్ అమల్లోకి తెచ్చింది. హత్యకు ముందు రోజు రాత్రి ప్రియుడు చమన్ ఇచ్చిన నిద్రమాత్రలను నజియా నీళ్లలో కలిపి భర్త మున్నా లాల్‌కి ఇచ్చింది. అవి తాగిన అతడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
అర్ధరాత్రి వేళ చమన్ తన స్నేహితుడు కిషన్‌ని వెంటబెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న మున్నా లాల్ గొంతు నులిమి ఊపిరాడకుండా చేశారు. ఆపై అతడు బ్రతికే అవకాశం లేకుండా మర్మాంగాలతో సహా పలు శరీర భాగాలకు విద్యుత్ షాక్ ఇచ్చారు. అంతటితో ఆగక, చనిపోయాడని నిర్ధారించుకోవడానికి కర్రలతో దారుణంగా కొట్టారు. హత్య అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి వీధిలో పడేసి అక్కడ నుంచి పరారయ్యారు.
భర్త కథ ముగిసిందని నిర్ధారించుకున్న నజియా, మరుసటి రోజు ఉదయం దొంగతనం నాటకానికి తెరలేపింది.తనే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, మా ఇంట్లోకి దొంగలు పడ్డారు.. నా భర్తపై దాడి చేసి చంపేశారు అని ఏడుస్తూ నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఇంట్లోని బీరువాలు తెరిచి, వస్తువులన్నీ నేలపై చల్లాచెదరుగా పడేసింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో తనిఖీలు చేపట్టారు. నజియా ప్రవర్తనపై అనుమానం రావడంతో ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అర్ధరాత్రి వేళ ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చి వెళ్లడం కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యింది. సీసీటీవీ విజువల్స్‌ను చూపించి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నజియా అసలు నిజం ఒప్పుకోక తప్పలేదు. ప్రియుడు చమన్ తో కలిసి వేసిన మర్డర్ ప్లాన్‌ను పూసగుచ్చినట్లు వివరించింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితురాలు నజియా, ప్రియుడు చమన్, అతడి సహచరుడు కిషన్‌లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కామంతో కళ్ళు మూసేసి, కట్టుకున్న భర్తను పొట్టనబెట్టుకున్న ఈ ఘతుకురాలి ఉదంతం ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.




