‘గొడ్రాలివి’ అంటూ నిత్యం వేధింపులు.. భర్తను కత్తితో నరికి చంపిన భార్య!

Bengaluru: సంతానం కలగడం లేదన్న కారణంతో మద్యం మత్తులో నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను ఓ భార్య దారుణంగా హతమార్చింది.

Arun Chilukuri
Published on: 13 Nov 2026 11:21 AM IST
‘గొడ్రాలివి’ అంటూ నిత్యం వేధింపులు.. భర్తను కత్తితో నరికి చంపిన భార్య!
X

‘గొడ్రాలివి’ అంటూ నిత్యం వేధింపులు.. భర్తను కత్తితో నరికి చంపిన భార్య!

Bengaluru: సంతానం కలగడం లేదన్న కారణంతో మద్యం మత్తులో నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తను ఓ భార్య దారుణంగా హతమార్చింది. ఈ ఘటన బెంగళూరులోని కెంపేగౌడనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీపురలో నివాసముంటున్న రాజశేఖర్ (32), మాలాశ్రీ (30) దంపతులకు వివాహమై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. రాజశేఖర్ ఓ ప్రైవేట్ బ్యాంకులో రుణాల మంజూరు విభాగంలో పనిచేసేవాడు. అయితే, పిల్లలు పుట్టడం లేదన్న కారణంతో అతను మద్యానికి బానిసై, రోజూ తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. 'నువ్వు గొడ్రాలివి' అంటూ మానసికంగా, శారీరకంగా తీవ్ర వేధింపులకు గురిచేసేవాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజశేఖర్ భార్యతో తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగాడు. నిత్యం జరుగుతున్న ఈ వేధింపులతో విసిగిపోయిన మాలాశ్రీ తీవ్ర ఆగ్రహానికి గురైంది. క్షణావేశంలో వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి నరికింది. ఈ దాడిలో రాజశేఖర్‌కు తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయాడు.

స్థానికుల సమాచారంతో తీవ్రంగా గాయపడిన రాజశేఖర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న కెంపేగౌడనగర పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలు మాలాశ్రీని అరెస్టు చేశారు. ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.