Parlakhemundi: పర్లాఖెముండిలో గంజాయి అక్రమ రవాణా కలకలం మహిళ అరెస్టు!

Parlakhemundi: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖెముండిలో అక్రమంగా బైక్‌పై గంజాయి తరలిస్తున్న మహిళను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు.

S.Anil, Gajapati Dst
Published on: 23 Oct 2026 8:55 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: పర్లాఖెముండిలో గంజాయి అక్రమ రవాణా కలకలం మహిళ అరెస్టు!

Parlakhemundi: గజపతి జిల్లా సదర్ మహాకుమా పర్లాఖెముండిలో 218 గ్రాముల గంజాయి అక్రమ రవాణా కేసులో ఎక్సైజ్ విభాగం ఒక మహిళను అరెస్టు చేసింది. పత్రూ నుండి కరాసింగ్ గంజాయి చోరీ చాలానా అభియోగంలో మహిళను అరెస్టు చేశారు. అందిన సమాచారం ప్రకారం, ఎక్సైజ్ అధిక్షకుడు శ్రీ ప్రసాద్ కుమార్ సాహు ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రుతురాజ్ బెహెరా, నిలాంచల్ నాయక్, నికితి పాలక్ తో కూడిన ఎక్సైజ్ దళం అటక్ చేసి బైక్ పై గంజా తరలిస్తున్నట్లు గుర్తించారు.

జిల్లా పిరిడిషా థానా పరిధిలోని అడవి ప్రాంతంలోని ప్రియాంక బిస్వాల్ అనే మహిళను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ మహిళ వద్ద నుండి 8 కిలోల 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని బహిరంగ మార్కెట్ విలువ రూ. 90 వేలకు పైగా ఉంటుందని చెప్పారు.

గజపతి జిల్లాలోని గోషాణి, సాహాడా అంచలలో అక్రమ గంజాయి సాగు మరియు స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు తీసుకుంటోందని, దుర్గమ అడవి మరియు జంగల్ రోడ్డు వెంట నిఘా పెంచి పహారా కాస్తున్నారని, త్వరలోనే మరికొందరిని అరెస్టు చేస్తామని ఎక్సైజ్ మరియు పోలీసు శాఖ సంయుక్తంగా ప్రకటించింది.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst