New Delhi: బ్రిజ్ భూషణ్ నిర్దోషిత్వాన్ని సవాల్ చేసిన మహిళా రెజ్లర్లు!
New Delhi: లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నలుగురు మహిళా రెజ్లర్లు.
New Delhi: బ్రిజ్ భూషణ్ నిర్దోషిత్వాన్ని సవాల్ చేసిన మహిళా రెజ్లర్లు!
New Delhi: లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించడాన్ని మహిళా రెజ్లర్లు సవాల్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఆయన నిర్దోషిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నలుగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బ్రిజ్ భూషణ్ సింగ్‌తోపాటు మరో నిందితుడు వినోద్ తోమార్పై కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా... ఇటీవల మెజిస్ట్రేట్ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
దీంతో కేసు రికార్డుల్లో ఉన్న సాక్ష్యాలను కోర్టు పాక్షికంగా మాత్రమే పరిగణనలోకి తీసుకుందని ఆరోపించారు. ఈ విషయంలో మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు అంచనాలు, ఊహాగానాల ఆధారంగా జరిగిందని తెలిపారు. కోర్టులో విచారణ సరిగ్గా చేయలేదని, సరైన చట్టాలు వర్తించేలా పరిశీలన జరగలేదని పిటిషన్లో వివరించారు. మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును, విచారణ తీరును పరిశీలించాల్సిందిగా రౌస్ అవెన్యూ కోర్టును కోరారు పిటిషనర్లు.




