Yogi Adityanath: మహిళలు కోటీశ్వరులైతేనే రాష్ట్రం అభివృద్ధి.. యోగి కీలక వ్యాఖ్యలు.!

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దాలంటే మహిళల భద్రత, ఆత్మగౌరవం , ఆర్థిక సాధికారత అత్యంత కీలకమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

G Krishna
Published on: 18 Oct 2026 5:14 PM IST
Yogi Adityanath
X

Yogi Adityanath: మహిళలు కోటీశ్వరులైతేనే రాష్ట్రం అభివృద్ధి.. యోగి కీలక వ్యాఖ్యలు.!

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దాలంటే మహిళల భద్రత, ఆత్మగౌరవం , ఆర్థిక సాధికారత అత్యంత కీలకమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. శరదీయ నవరాత్రుల అష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మా మహాుగౌరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. శాంతి, స్వచ్ఛత, కరుణలకు ప్రతీకగా నిలిచే మాత ఆశీస్సులతో రాష్ట్రంలో మహిళాభ్యున్నతికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు.

మహిళలు ఆరోగ్యంగా, సురక్షితంగా, పోషకాహార లోపం లేకుండా జీవిస్తూ తమ కాళ్లపై తాము నిలబడినప్పుడే నిజమైన సామాజిక పురోగతి సాధ్యపడుతుందని సోషల్ మీడియా వేదికగా ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో విద్య, పోషకాహారం, ఆర్థిక చేరిక, ఉపాధి అవకాశాల కల్పనలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని, దీనివల్ల యూపీ అభివృద్ధిలో వారు క్రియాశీల భాగస్వాములుగా మారుతున్నారని తెలిపారు.

పోషకాహార పంపిణీలో విప్లవాత్మక మార్పులు.. మహిళలకే బాధ్యతలు

2017కి ముందు రాష్ట్రంలో చిన్నారులకు అందించే అదనపు పోషకాహార పంపిణీ వ్యవస్థ నేరపూరిత శక్తుల చేతుల్లో చిక్కుకుని అస్తవ్యస్తంగా మారిందని సీఎం ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. ఈ వ్యవస్థలో పారదర్శకతను తీసుకొచ్చి, మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో టేక్-హోమ్ రేషన్ తయారీ ,

పంపిణీ బాధ్యతలను పూర్తిగా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకే అప్పగించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా అంగన్‌వాడీ కార్యకర్తల నెలసరి గౌరవ వేతనాన్ని రూ. 3,000 నుంచి ఏకంగా రూ. 12,000కు పెంచామని, వారి సామాజిక భద్రత కోసం ఆరోగ్య బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.

డెయిరీ రంగాలు, 'లఖ్‌పతి దీది' ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక స్వయంప్రతిపత్తి

ఉత్తరప్రదేశ్‌లోని 31 జిల్లాల్లోని బాలిని, సమర్థ్య, కాశీ, బాబా గోరఖ్‌నాథ్, సృజని వంటి డెయిరీ ప్రొడ్యూసర్ కంపెనీల ద్వారా నాలుగు లక్షలకు పైగా మహిళలు ఉపాధి పొందుతున్నారని సీఎం పేర్కొన్నారు. డెయిరీ రంగాన్ని మహిళలు ఒక సుస్థిర ఆదాయ వనరుగా, వ్యాపార అవకాశంగా మలచుకుంటూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారన్నారు.

అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలోనే బ్యాంకింగ్ సేవలను అందిస్తూ 'బీసీ సఖులు' ఆర్థిక సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో సుమారు 1.20 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానమై ఉన్నారని..

ఎస్‌హెచ్‌జీలు , 'లఖ్‌పతి దీది' వంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా మహిళలు తమ నైపుణ్యాలతో కుటుంబాలను ఆర్థికంగా ఉన్నత స్థితికి చేర్చుకుంటున్నారని తెలిపారు."సశక్త్ నారీ, సమృద్ధి ఉత్తరప్రదేశ్" (సబలమైన మహిళలు, సుసంపన్న ఉత్తరప్రదేశ్) అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.