Nellore: పడుగుపాడులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 150 కుటుంబాలు!

Nellore: కోవూరు మండలం పడుగుపాడులో వైసీపీకి షాక్ తగిలింది. రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో 150 కుటుంబాలు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.

A Praveen, Nellore
Published on: 16 Nov 2026 8:23 AM IST
Nellore
X

Nellore: పడుగుపాడులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 150 కుటుంబాలు!

Nellore: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గనాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

వైసీపీకి చెందిన కీలక నాయకుడు రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో దాదాపు 150కి పైగా కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore