Nellore: వీధి కుక్కల స్వైరవిహారం.. ఒకే గ్రామంలో 16 మందికి గాయాలు!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం బ్రాహ్మణపల్లిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో 16 మంది తీవ్రంగా గాయపడగా పొదలకూరు ఆసుపత్రికి తరలించారు.
Nellore: వీధి కుక్కల స్వైరవిహారం.. ఒకే గ్రామంలో 16 మందికి గాయాలు!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం బ్రాహ్మణపల్లిలో కుక్కల బెండద ఎక్కువైంది. కుక్కలు వీధి ల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దారిన వెళ్లుతున్న వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి, కలువాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 16 మందిపై దాడి చేసి కరిచింది, గాయపడిన వారిని పొదలకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించు కొంటున్నారు, పంచాయతీ అధికారులు కుక్కలను నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల కోరుతున్నారు. కలువాయి బస్టాండ్ సెంటర్ లో వాహనదారుల పై కుక్కలు దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. గ్రామాల్లో వీధి కుక్కలను నివారించేందుకు చొరవ చూపాలని కోరుతున్నారు.




