Nellore: యల్లాయపాలెంలో గంధ మహోత్సవ గోడపత్రికల ఆవిష్కరణ!
Nellore: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం యల్లాయపాలెంలో హజరత్ గౌసే ఆజాం 16వ గంధ మహోత్సవ గోడపత్రికలను సూఫీ గురువు హయ్యద్ బాబా ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
Nellore: యల్లాయపాలెంలో గంధ మహోత్సవ గోడపత్రికల ఆవిష్కరణ!
నెల్లూరు: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని యల్లాయపాలెంలో గ్రామంలో వెలసి ఉన్న శ్రీ హజరత్ సయ్యదినా గౌసే ఆజాం మహబూబ్-ఏ-సుభాని పీరాన్-ఏ-పీర్ వారి 16వ గంధ మహోత్సవాన్ని పురస్కరించుకుని గోడపత్రికలను ఆవిష్కరించారు.
నెల్లూరు సూఫీ గురువు హయ్యద్ బాబా ఆధ్వర్యంలో సూఫీ మత పెద్దలు గంధ మహోత్సవ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హయ్యద్ బాబా మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన జెండా ఉత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమం, అదే రోజు ఘనంగా కవ్వాలి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 23వ తేదీన చదివింపుల కార్యక్రమం ఘనంగా జరుగుతుందని చెప్పారు.
గంధ మహోత్సవంలో హిందూ, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జామలుద్దీన్,మహాభాషా,అస్లాంబాబా పాల్గొన్నారు.




