Vinjamuru: ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితా విడుదల: ఎంపీడీవో!
Vinjamuru: వింజమూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు 42 పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితా విడుదలైంది. సెప్టెంబర్ 19న తుది జాబితా విడుదలవుతుందని ఎంపీడీవో తెలిపారు.
Vinjamuru: ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితా విడుదల: ఎంపీడీవో!
వింజమూరు: ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వింజమూరు మండలంలో పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాను అధికారులు విడుదల చేశారు. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 42 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
గతంలో 2021లో నిర్వహించిన ఎంపిటిసి ఎన్నికల్లో మండలంలో 35 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం పెరిగిన ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకొన్ని అదనంగా మరో 7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,000 మంది ఓటర్లకు మించకుండా ఉండేలా కేంద్రాలను గుర్తించినట్లు ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి, ఎన్నికల ప్రత్యేక అధికారి శేషగిరి తెలిపారు.
డ్రాఫ్ట్ జాబితాపై రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఈ నెల 16వ తేదీ వరకు స్వీకరించి పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి,పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై వారి అభిప్రాయాలను అధికారులు తెలుసుకున్నారు.
అందిన సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం అవసరమైన మార్పులు చేపట్టి, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆమోదంతో ఈ నెల 19వ తేదీన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ సమావేశంలో వైసీపీ, కూటమికి చెందిన నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.




