Nellore: నెల్లూరులో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు!

Nellore: నెల్లూరు 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో నూకలపాటి సురేష్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 5 Oct 2026 11:59 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు!

Nellore: నెల్లూరు 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ మరింత పెరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని నమ్ముతూ.. నూకలపాటి సురేష్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.

ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి కోటేశ్వర రెడ్డి, డివిజన్ ఇన్‌చార్జ్ మస్తాన్ లతో కలిసి కొత్తగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నూకలపాటి సురేష్‌తో పాటు ఆయన అనుచరులు 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. సురేష్ సేవలను పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని తెలిపారు.

53, 54 డివిజన్లలో మొదటి నుంచీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని.. అందుకే ఈ రెండు డివిజన్లు పార్టీకి కంచుకోటలుగా మారాయని అన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడంతో పాటు.. 53, 54 డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.

పెన్నా పరివాహక ప్రాంతమైన వెంకటేశ్వరపురంలో ప్రజలను వరదల నుంచి రక్షించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. వెంకటేశ్వరపురం ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి మౌలిక వసతుల అభివృద్ధి గత వైసిపి ప్రభుత్వ పాలనకు నిదర్శనమని చెప్పారు.

ఇక తాజాగా పార్టీలో చేరిన నూకలపాటి సురేష్‌తో పాటు 50 కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.

రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 53, 54 డివిజన్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ప్రజా ఆకాంక్ష మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. ప్రజలందరికీ న్యాయం చేస్తారని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE