Nellore: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ కప్పిరా రేవతి!

Nellore: నెల్లూరు 66వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన కప్పిరా రేవతి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిశారు. డివిజన్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి.

A Praveen, Nellore
Published on: 6 Nov 2026 1:45 PM IST
Nellore
X

Nellore: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ కప్పిరా రేవతి!

Nellore: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆయన నివాసంలో 66వ డివిజన్ కార్పొరేటర్ కప్పిరా రేవతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి మెజారిటీతో ఘన విజయం సాధించిన కప్పిరా రేవతిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా 66వ డివిజన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని రేవతి తెలిపారు. డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సహకరించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి అభినందనలు తెలియజేశారు.

A Praveen, Nellore

A Praveen, Nellore