Nellore: గిరిజన కుటుంబానికి ఆదివాసి సంక్షేమ సంఘం భరోసా!
Nellore: నెల్లూరు జిల్లా సంగంలో బైక్ ప్రమాదంలో మృతి చెందిన గిరిజనుడు మణి కుటుంబానికి ఆదివాసి సంక్షేమ సంఘం, దాతల ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు.
Nellore: గిరిజన కుటుంబానికి ఆదివాసి సంక్షేమ సంఘం భరోసా!
నెల్లూరు: నెల్లూరు జిల్లా సంగంలోని తిరుమనతిప్ప ఎస్టీ కాలనీలో ఇటీవల బైక్ ప్రమాదంలో మృతి చెందిన గిరిజనుడు మణి కుటుంబానికి ఆదివాసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక, నిత్యావసర సహాయం అందించారు.ఆదివాసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. సురేష్ సూచనల మేరకు, జిల్లా అధ్యక్షులు బొచ్చు.
నాగేశ్వరరావు సహకారంతో గ్రామానికి చెందిన దాతలు, టీడీపీ నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్, నేతాజీ కాలేజ్ కరస్పాండెంట్ మదర్ భాష తదితరుల సహకారంతో బాధిత కుటుంబానికి ఒక బియ్యపు బస్తా, నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, రూ.5,000 నగదు అందజేశారు.
మృతుడు మనీకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలిపారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నేతాజీ కాలేజ్ కరస్పాండెంట్ మదర్ భాష, పిల్లలు ఇంటర్మీడియట్‌కు చేరుకున్నప్పుడు ఉచితంగా విద్య అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్నీ విధాల ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నారే వెంకటేశ్వర్లు,వినయ్ తదితరులు పాల్గొన్నారు.




