Gudur: గూడూరు ప్రజలకు రూ.43 లక్షల విలువైన అడ్వాన్స్‌డ్ అంబులెన్స్ అంకితం!
Gudur: గూడూరులో రోటరీ క్లబ్, అలయన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో రూ.43 లక్షల విలువైన బొమ్మిరెడ్డి అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే.
Gudur: గూడూరు ప్రజలకు రూ.43 లక్షల విలువైన అడ్వాన్స్‌డ్ అంబులెన్స్ అంకితం!
Gudur: చెన్నైకు చెందిన ఆలయన్స్ గ్రూపు వారి దాతృత్వంతో సి ఎస్ ఆర్ గ్రాంట్ ద్వారా రోటరీ ఫౌండేషన్ వారి సహకారంతో రోటరీ క్లబ్ గూడూరు వారి ఆధ్వర్యంలో విజయవాడ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ వారి భాగస్వామ్యంతో గూడూరు కు చెందిన బొసారెడ్డి కుంతలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణతో 43 లక్షల విలువ చేసే బొమ్మిరెడ్డి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ని గూడూరు ప్రజలకు ఈరోజు శాసనసభ్యులు శ్రీ పాశం సునీల్ కుమార్ గారి ద్వారా అంకితం చేశారు.
ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన రోటరీ క్లబ్ అధ్యక్షులు తిరుమూరు సురేష్ రెడ్డి మాట్లాడుతూ, నేను ప్రెసిడెంట్ గా ఉన్న ఈ కాలంలో ఇంత పెద్ద ప్రాజెక్టును మాకు అందించినందుకు స్పాన్సర్ అయినటువంటి అలయన్స్ గ్రూపుకు మా క్లబ్ సభ్యులు పీడీజి బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన శాసనసభ్యులు శ్రీ సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన
గూడూరు శాసనసభ్యులు శ్రీ పాశం సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ, గూడూరు అభివృద్ధిలో బొమ్మిరెడ్డి సోదరుల పాత్ర ఎంతో ఉందని, 1995లో నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్న కాలంలో జన్మభూమి పథకం ద్వారా గూడూరులో వేసినటువంటి సిసి రోడ్లలో వారి కాంట్రిబ్యూషన్ ఉందని తెలిపారు. ఈ అంబులెన్స్ ఎంతో ఆధునిక సౌకర్యాలతో ఉందని ప్రాణాపాయంలో ఉన్నటువంటి ఎంతోమందికి, ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ అంబులెన్స్ ఉపయోగపడు తున్న కారణంగా నాకెంతో ఆనందంగా ఉంది అన్నారు.
ఈ సందర్భంగా అలయన్స్ గ్రూపు పార్టనర్ మరియు ఆర్ ఆర్ ఎఫ్ సి జోన్-7 పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బొమ్మిరెడ్డి సురేంద్ర మాట్లాడుతూ మాకు సంబంధించిన అలయన్స్ గ్రూపు ద్వారా సి ఎస్ ఆర్ ఫండ్స్ లో నుంచి రోటరీ క్లబ్ గూడూరు మరియు బుసారెడ్డి కుంతలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 43 లక్షల రూపాయల విలువ చేసే అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ని ఈరోజు గూడూరు ప్రజలకు అంకితం చేసామని అన్నారు.
ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ వారి సహకారం మరి ముఖ్యంగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ వి సుబ్బారావు గారి సహకారం మరువలేనిది అని అన్నారు. ఈ సందర్భంగా అలయన్స్ గ్రూపు వారికి, నంబూరు మనోజ్ గారికి, మా సోదరులు బొమ్మి రెడ్డి సురేష్ రెడ్డి, సునీల్ రెడ్డి గార్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.
ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి విజయవాడ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ ప్రతినిధి రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు AEMGA-Zone -7 ఆర్ వి సుబ్బారావు గారు మాట్లాడుతూ, ఇంత అడ్వాన్సుడ్ ఎక్విప్మెంట్తో అంబులెన్స్ ని ఈ గూడూరు ప్రజలకు అందించడంలో, బొమ్మి రెడ్డి కుటుంబానికి గూడూరు పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టులో మమ్ములను భాగస్వాములను చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొణిదల ముని గిరీష్, బుసారెడ్డి కుంతలమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ బుసారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ సి జనార్దన్ రెడ్డి, బి దశరథరామిరెడ్డి, సర్వీస్ ప్రాజెక్ట్ చైర్ ఎన్ బాలకృష్ణం రాజు, చంద్రశేఖర్ రెడ్డి ఇంకా అనేకమంది రొటేరియన్లు పాల్గొన్నారు.
అనంతరం గూడూరు శాసనసభ్యులు శ్రీ పాశం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా అంబులెన్స్ ను రోటరీ ఫ్లాగ్ ఊపి ప్రారంభించారు.




