Nellore: ఏఐఎస్‌ఎఫ్ నిరసన విద్యా వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆగ్రహం!

Nellore: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నెల్లూరులో ఏఐఎస్ఎఫ్ నిరసన. ఫీజు రీయింబర్స్‌మెంట్, నీట్ సమస్యలపై మండిపడ్డ నేతలు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 20 Aug 2026 2:31 PM IST
Nellore
X

Nellore: ఏఐఎస్‌ఎఫ్ నిరసన విద్యా వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆగ్రహం!

Nellore: "ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ నిరసన కార్యక్రమం"

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు తీసుకురావడం పట్ల తీవ్ర ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అఖిలభారత విద్యార్థి సమాఖ్య.

ఈ నేపథ్యంలో నెల్లూరులో నిరసన కార్యక్రమం చేపట్టింది.

ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య..( ఏఐఎస్ఎఫ్) నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి.... ఎస్.కె మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ...

భారతదేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఆలిండియా స్టూడెంట్ ఫెడరేషన్, విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ ...రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విద్యా వ్యతిరేక కార్యక్రమాల పైన పోరాటం చేస్తున్నామని చెప్పారు...

ఎంతోమంది విద్యార్థుల లక్ష్యం అయిన నీట్ పరీక్షల ఎంపిక విధానంలో.... ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని ఎంతో మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు... దీనికి మేమేం తక్కువ కాదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.... యువగళం పాదయాత్ర సందర్భంలో జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ అన్ని క్లియర్ చేస్తామని చెప్పారని.. కానీ ఏ ఒక్కపేద విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు... ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల హాస్టల్స్ లో కనీస వసతుల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

తన కొడుకు దేవాన్ష్ ని, హాస్టల్లో ఉంచుతానని మంత్రి నారా లోకేష్ చాలా గొప్పగా చెప్పారని... ఒక్క రాత్రి మీరు హాస్టల్స్ లో నిద్ర చేస్తే హాస్టల్స్ పరిస్థితి మీకు అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు... అదేవిధంగా వాకాడు ప్రాంతంలోని గురుకుల పాఠశాలను ఎత్తివేసి... నీట్ మెయిన్స్ కోచింగ్ సెంటర్లు పెడతానని చెప్పడం దారుణమని అన్నారు.

పేద విద్యార్థులకు మెయిన్స్ నీట్ కోచింగ్ అందివ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని అదే రీతిగా 600 మంది పేద విద్యార్థులను, ఏ మాత్రం ముందస్తు సమాచారం లేకుండా రాత్రికి రాత్రి వారిని రోడ్డున పడేయడం దారుణమని అన్నారు. విద్యా వ్యాపారవేత్తలను పార్టీలు పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి విద్యార్థులు విలువ ఏమాత్రం తెలియదని అన్నారు.

ఇలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు తీసుకొని వస్తే ఏఐఐఎస్ఎఫ్ చూస్తూ ఊరుకోదని, కలెక్టరేట్లు పార్టీ కార్యాలయాలే కాదు ఢిల్లీ పార్లమెంటును సైతం ముట్టడి చేస్తామని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story