Nellore: నెల్లూరు కార్పొరేషన్లో కూటమి ప్రభంజనం
Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి క్లీన్‌స్వీప్ సాధించింది. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంబరాల్లో పాల్గొని డ్యాన్సులు చేశారు.
Nellore: నెల్లూరు కార్పొరేషన్లో కూటమి ప్రభంజనం
నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీ విజయప్రభంజనం సృష్టించింది..ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అన్ని డివిజన్లలో విజయం సాధిస్తూ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ సాధించిన ఈ ఘన విజయంపై కూటమి శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగిపోతోంది.ఈ సందర్భంగా గోమతి నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో సంబరాలు ఆంబరాన్నంటాయి.
రాష్ట్ర మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నారాయణ కుటుంబ సభ్యులు సతీమణి రమాదేవి, కుమార్తెలు షరిణి, సింధు అందరూ ఒకే వేదికపైకి వచ్చి ఈ అద్భుత విజయాన్ని వేడుకగా జరుపుకున్నారు.
క్యాంపు కార్యాలయంలో టీడీపీ విజయోత్సవ పాటలు మార్మోగుతుండగా నేతలు, కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా డాన్సులు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ, పసుపు వర్ణంలో మునిగిపోయిన వాతావరణంలో ఈ చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా ఆస్వాదించారు.




