Nellore: అమ్మకు పాదాభివందనం కార్యక్రమంలో ముక్కాల ద్వారకానాథ్

Nellore: శేట్టిగుంట రోడ్డులో ముక్కాల ద్వారకానాథ్ మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన 'అమ్మకు పాదాభివందనం' కార్యక్రమం.

V. Narasimhulu, Nellore
Published on: 7 Jun 2026 5:09 PM IST
Nellore
X

Nellore: అమ్మకు పాదాభివందనం కార్యక్రమంలో ముక్కాల ద్వారకానాథ్

Nellore: శేట్టిగుంట రోడ్డు పప్పుల వీధిలో ముక్కాల ద్వారకానాథ్ మరియు వారి మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన అమ్మకు పాదాభివందనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి.

ప్రతి బిడ్డకు అమ్మ విలువ తెలియాలని, అమ్మను ఇంతగా గౌరవించాలీ అనే ఆలోచన ప్రతి బిడ్డకు కలగాలని కోరారు. అమ్మ గురించి ఎన్ని మాటలు మాట్లాడాలన్నా మాటలు చాలావు అన్నారు. మాటలు నేర్పిన అమ్మ గురించి.. మనం ఏమని మాట్లాడగలుగుతాం అని అన్నారు. భగవంతుడు సైతం అమ్మకు బానిసేనని వర్ణించారు నిర్వాహకులు.

ఇంతటి గొప్ప కార్యక్రమం ముక్కాల ద్వారకానాథ్ మిత్ర మండలి వారి ఆలోచనకు అభినందనలు తెలిపారు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి. నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరం నాటికి 3,333 మందితో ఈ కార్యక్రమం జరపటం చాలా గొప్ప విషయం అని అన్నారు.

ఈ కార్యక్రమం నిర్వహించటానికి ముఖ్య కారణం అయినా ముక్కాల ద్వారకానాథ్ మిత్రమండలి మహిళా విభాగానికి అభినందనలు తెలిపారు. తల్లి.. బిడ్డ అనురాగం చూడటం నిజంగా చాలా సంతోషకరం అని ఈ అవకాశం ఇచ్చిన కార్య నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story