Sangam: కండ్రిక బ్రహ్మంగారి ఆలయానికి రూ.10 లక్షల నిధులు.. మంత్రి ఆనంకు

Sangam: సంగం మండలం జంగాల కండ్రిక గ్రామంలోని బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రూ.10 లక్షల నిధులు మంజూరు చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 17 May 2026 5:13 PM IST
Sangam
X

Sangam: కండ్రిక బ్రహ్మంగారి ఆలయానికి రూ.10 లక్షల నిధులు.. మంత్రి ఆనంకు

సంగం: జంగాల కండ్రిక గ్రామంలోని హైస్కూల్ సమీపంలో ఉన్న బ్రహ్మగారి ఆలయ అభివృద్ధికి సహకరించిన రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికు కాలనీ వాసులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం మంత్రి రూ.10 లక్షలు మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేసిన గ్రామానికి చెందిన టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ చంద్ర సేవలను కాలనీ వాసులు అభినందించారు. గ్రామ ప్రజల అభ్యర్థనను మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.ఆలయ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఈ నిధులు ఉపయోగపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story