Nellore: ఆలయాల పునఃనిర్మాణం నా సుకృతం: మంత్రి ఆనం!
Nellore: నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో పురాతన ఆలయాల పునరుద్ధరణకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భూమిపూజ చేశారు.
Nellore: ఆలయాల పునఃనిర్మాణం నా సుకృతం: మంత్రి ఆనం!
నెల్లూరు: పురాతన ఆలయాలను పునఃనిర్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు,నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని చిత్తలూరు గ్రామంలో నిర్వహించిన చెన్నకేశవ స్వామి దేవాలయం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు, ముందుగా పెరుమాళ్ళ పాడు గ్రామంలో ఇసుక మెటలో కూరుకొని పోయిన పురాతన రామలింగేశ్వరస్వామి దేవాలయం, చేజర్ల లోని చెన్నకేశవ స్వామి దేవాలయాలకు భూమిపూజ చేసారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గం లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామన్నారు, రాష్ట్రమం లో వేల ఆలయాలను పునః నిర్మిస్తున్నామన్నారు,ఆలయాల్లో పాలకవర్గం పెత్తనం లేకుండా చేసామని గతంతో పోల్చుకుంటే ఆలయాల్లో గణనీయంగా భక్తుల సంఖ్య పెరిగిందన్నారు,ఈ ప్రభుత్వం రాష్ట్రంలో 62ఆలయాలలో నిత్య అన్నదానం చేస్తున్నామని దూప దీప నైవేద్యం కింద 6వేల 2వందల ఆలయాలకు నెలకు 10 వేలు ఇస్తున్నామన్నారు.
చేజర్ల మండలంలోని ఈ మూడు ఆలయాలకు సుమారు 6కోట్ల రూపాయలతో పునః నిర్మిస్తున్నామన్నారు,శ్రీవాణి ట్రస్ట్ క్రింద రాష్ట్రంలో 750 కోట్లతో 5వేలు భజన మందిరాలు నిర్మిస్తున్నామని తెలిపారు,నెలకు 24 లక్షల మంది దేవాలయాలలో అన్నదానం స్వికరిస్తున్నారన్నారు,వచ్చే సంవత్సరం పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.
పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి నది ఒడ్డున వున్న ఆలయాలకు 5వందల కోట్లతో ఆలయాలకు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు,కూటమి ప్రభుత్వం ఆలోచన ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ గా చేయడం మన ముఖ్యమంత్రి సంకల్పం అన్నారు, ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు సిరాజ్, సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ్ చౌదరి, జిల్లా ఉపాధ్యక్షురాలు రేవతి చౌదరి,సీనియర్ నాయకులు మన్నెం పెంచలనాయుడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




