Ananthasagaram: రేవూరు, మినగల్లులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

Ananthasagaram: అనంతసాగరం మండలంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం. రబీలో వరి సాగుపై సూచనలు, ఫార్మర్ ఐడీ, ఈ-కేవైసీ ప్రాముఖ్యతను వివరించిన వ్యవసాయ అధికారిణి.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 23 Sept 2026 4:36 PM IST
Ananthasagaram
X

Ananthasagaram: రేవూరు, మినగల్లులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

అనంతసాగరం: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని రేవూరు, మినగల్లు గ్రామములలో మండల వ్యవసాయ అధికారిని ఈ శైలజా కుమారి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి ఈ,శైలజ కుమారి మాట్లాడుతూ గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి వారి ఆదేశాల మేరకు రబీ సీజన్ లో అక్టోబర్ మాసములో కాలువల క్రింద గాని, బోరుబావుల కిందగాని వరి నారు పోయకూడదని తెలియజేసినారు.

ఎల్ నినో ప్రభావము మార్చి 2027 వరకు కొనసాగుతుంది కాబట్టి భూగర్భ జలాలు అడుగంటుతాయి. అందువల్ల పొలాలకు నీరు సరిపోదు. నవంబర్ లో అధిక వర్షాలు లేదా సైక్లోన్ వచ్చినట్లు అయితే యధావిధిగా వరి పంటను సాగుచేసుకోవచ్చును అని తెలియజేసినారు.

అదే విధంగా పొలము ఉన్న ప్రతి రైతుకి ఫార్మర్ ఐ .డి తప్పని సరిగా ఉండాలి అని,ఈ ఫార్మర్ ఐ. డి వలన వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా లభించే ప్రతి స్కీమ్ పొందుటకు అర్హత ఉంటుందని,ధాన్యం కొనుగోలు కేంద్రం లో ధాన్యం విక్రయాలకు తప్పని సరిగా ఫార్మర్ ఐ.డి ఉండాలని తెలియ జేయడం జరిగింది.

అదే విధముగా P.M. కిసాన్ లబ్ది పొందే ప్రతి రైతు 2026- 2027 వ సంవత్సరానికి తప్పని సరిగా EKYC చేయించుకోవాలి,E పంట నమోదు చేయించుకొన్న ప్రతి రైతు EKYC చేయించుకోవాలి,PM కిసాన్ రూ 2000/- పడని రైతులు మీ RSK లో ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ బుక్ xerox ఇచ్చినట్లు అయితే మీకు అమౌంట్ ఎందుకు పడలేదో VAA లు MAO ద్వారా తెలుసుకొని రైతులకు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ అధికారిణి K.కృష్ణవేణి, VAA లు M. శ్రావణి , CH.. స్వప్న మరియు రైతులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)