Kaluvaya: కలువాయి బడిలో అంగన్వాడీలకు శిక్షణ మెరుగైన సేవలకు పిలుపు!
Kaluvaya: నెల్లూరు జిల్లా కలువాయి జెడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమం. పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్యపై అవగాహన కల్పించారు.
Kaluvaya: కలువాయి బడిలో అంగన్వాడీలకు శిక్షణ మెరుగైన సేవలకు పిలుపు!
Kaluvaya: నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ సుధాకర్, రాజేశ్వరి, రాజ్యలక్ష్మి అంగన్వాడీ సిబ్బందికి పలు అంశాలపై శిక్షణ అందించారు.
ఈ సందర్బంగా సుధాకర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణులు, బాలింతలకు అందించాల్సిన సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




