Nellore: పండుగ వాతావరణం లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ నిధుల పంపిణీ. 5299 మంది రైతులకు రూ. 3.47 కోట్ల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

V. Narasimhulu, Nellore
Published on: 21 Jun 2026 11:21 AM IST
Nellore
X

Nellore: పండుగ వాతావరణం లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం

Nellore: నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజుగూడూరు గ్రామంలో రెండవ సంవత్సరం, మొదటి విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..

వ్యవసాయ రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5299 మంది రైతులకు 3 కోట్ల 47 లక్షల రూపాయలు నిధులు విడుదల చేశామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు తగిన సమయంలో అన్నదాత సుఖీభవ ద్వారా, నగదు అందించడం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఒక్క పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధిలో మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం పరుగులు పెడుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాదరాజు గూడూరు గ్రామానికి 8 కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ బూడిద విజయ్ కుమార్, ఏఎంసీ ఛైర్మెన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థాన చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ సారంగం గున్నయ్య, కో క్లస్టర్ ఇంచార్జ్ కుంచనపల్లి శివ కుమార్, మాజీ సర్పంచ్ చిట్టిబొయిన వెంకటేశ్వర్లు యాదవ్, మాదరాజు గూడూరు సొసైటీ చైర్మన్ బైన బోయిన సుధాకర్ యాదవ్, ఉప్పు.కృష్ణ,పందిపాటి రాము తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story