Nellore: ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరం కొనసాగింపు

Nellore: 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్‌సీసీ క్యాడెట్లకు వార్షిక శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.

V. Narasimhulu, Nellore
Published on: 11 May 2026 3:24 PM IST
Nellore
X

Nellore

Nellore: నెల్లూరు 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సి సి లెఫ్ట్నెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే ఆధ్వర్యంలో యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపు -20 ధనలక్ష్మి పురం లోని నారాయణ సిబియస్సీ రెసిడెన్సియల్ హైస్కూల్ నందు గత ఆరు రోజులుగా నిర్వహింపబడుతున్నది.

ఈ శిక్షణా శిబిరానికి అడ్జటెంట్ వి. మల్లికార్జున్ రెడ్డి, ట్రైనింగ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు వ్యవహరిస్తున్నారు.

విశాఖ పట్నంలో 25 మే నుంచి 03 జూన్ వరకు జరుగబోవు

"ఇంటర్ గ్రూప్ కాంపిటేషన్ క్యాంపు"లో 10 ఆంధ్ర నేవల్ ఎన్ సి సి నెల్లూరు డి. కే మహిళా డిగ్రీ కళాశాల, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల సీనియర్ డివిజన్, సీనియర్ వింగ్ ఎన్ సి సి క్యాడేట్లు విజయం సాధించేలా "ఇండియన్ నేవల్ షిప్ నీలగిరి" గురించి షిప్ మోడలింగ్ ఇన్స్ట్రక్టర్ ఎస్. వి. రామన్ తగు శిక్షణ ఇచ్చారని చెప్పారు. ఇండియన్ నేవీలో షిప్పుల యొక్క ప్రాధాన్యత,విశిష్టత వాటిని వీటితో తయారు చేస్తారు, షిప్పుల యొక్క విభాగాలు తదితర విషయాలు గురించి వివరించారు.

ఈ శిక్షణా శిబిరంలో క్యాడేట్లకు శారీరక వ్యాయామం, నేవల్ ఓరియంటేషన్, రిగ్గింగ్, బోట్ వర్క్, షిప్ మోడలింగ్,

వెపన్ ట్రైనింగ్,పరేడ్ డ్రిల్ల్,ప్రకృతి విపత్తులు - నిర్వహణ - నివారణ చర్యలు,సామాజిక సేవా,

లీడర్ షిప్ క్వాలిటీస్,సోషల్ అవేర్ నెస్,నేవల్ కమ్యూనికేషన్,సీమఫోర్, తదితర అంశాలపై శిక్షణ నిచ్చారు.అనంతరం కేడేట్లచే నిర్వహించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఈ శిక్షణా శిబిరంలో

సబ్ లెఫ్ట్నెంట్ ఎస్ కే. న్యామతుల్లా,సెకండ్ ఆఫీసర్లు పెంచల ప్రసాద్, ఎం.సురేష్,కె.సురేష్, కార్తీక్,, ఫరూక్,గర్ల్ చైల్డ్ ఇన్స్ట్రక్టర్ పూజిత, చీఫ్ ఇన్స్ట్రక్టర్ లోకేష్, పి.ఐ స్టాఫ్ రమణ,లక్ష్మణ్ కుమార్,లక్ష్మీ నారాయణ,నవీన్,దీపక్,శివ, పృథ్వి రాజ్, అనురాగ్ తదితరులు పాల్గొని కేడెట్లకు శిక్షణ నిచ్చారు.

ఈ క్యాంపుకు

గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలలకు చెందిన ఎన్సిసి క్యాడెట్లు హాజరై శిక్షణ పొందుతున్నారు. ఈ శిబిరంలో కేర్ టేకర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story