Nellore: నెల్లూరు నగరవనాలను వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం
Nellore: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా 17 నగరవనాలు, ఎకో పార్కులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
Nellore: నెల్లూరు నగరవనాలను వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం
Nellore: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ బుధవారం (01-07-2026) మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చేసిన 17 నగరవనాలు, ఎకో పార్కులు, ఎకో ట్రైల్స్, కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం (CBET) కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా అటవీ (టెరిటోరియల్) డివిజన్ పరిధిలో అభివృద్ధి చేసిన నెల్లూరు నగరవనం మరియు కావలి నగరవనంలను కూడా ఉప ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.
నెల్లూరు, కావలి నగరవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీశాఖ అధికారులు, ప్రజల సమక్షంలో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కె. మహబూబ్ బాషా, ఐఎఫ్‌ఎస్, సామాజిక అటవీ విభాగం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ ఎం. నాగార్జున రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఎస్, కావలి సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ పి. శ్రీకాంత్ రెడ్డి, నెల్లూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ ఎస్. మాల్యాద్రి, కావలి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీమతి జి.ఎస్.ఎల్. సౌజన్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి ఈ రెండు నగరవనాల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నగరవనాలు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంలో, జీవవైవిధ్య పరిరక్షణలో, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
నెల్లూరు, కావలి నగరవనాల ప్రారంభం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ అటవీ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం విస్తరణ, ప్రజలకు మెరుగైన వినోద, విశ్రాంతి వనరుల కల్పన దిశగా మరో కీలక ముందడుగు వేసిందని అధికారులు తెలిపారు.




