Nellore: నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విస్తృత పర్యటన

Nellore: నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన. పలు ఆలయాల సందర్శన, కుంభాభిషేకంలో పాల్గొననున్న మంత్రి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 April 2026 7:07 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విస్తృత పర్యటన

నెల్లూరు: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఏప్రిల్ 23న గురువారం ఉదయం 10 గంటలకు పొదలకూరు మండలం విరుపూరులోని శ్రీ సీతారామస్వామి దేవస్థానాన్ని సందర్శించి మహా కుంభాభిషేకంలో పాల్గొంటారు. అనంతరం నెల్లూరుకు చేరుకుని మధ్యాహ్నం జడ్పీ హాల్‌లో ఐఏబీ సమావేశంలో పాల్గొంటారు.

ఏప్రిల్ 24న శుక్రవారం ఉదయం 10 గంటలకు ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్ ప్రాంతంలో శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కార్యక్రమాల అనంతరం తిరిగి నెల్లూరుకు చేరుకుంటారు. ఏప్రిల్ 25న నెల్లూరులో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story