Singarayakonda: షన్ డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ప్రతాపరెడ్డి!

Singarayakonda: ప్రకాశం కొండేపిలో బీసీ, ఎస్టీ హాస్టళ్లు, రేషన్ షాపులను ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాపరెడ్డి తనిఖీ చేశారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

Ram Mohan, Singarayakonda
Published on: 9 Sept 2026 7:06 AM IST
Singarayakonda
X

Singarayakonda: షన్ డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ప్రతాపరెడ్డి!

Singarayakonda: ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో పలు బీసీ ఎస్టీ హాస్టల్స్ ను రేషన్ షాపులను తనిఖీ చేసిన ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాపరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడే రేషన్‌ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పాఠశాలలోని వంటశాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

రేషన్‌ డీలర్ల పంపిణీపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రేషన్‌కు బదులుగా నగదు ఇవ్వడం, చక్కెర పంపిణీ చేయకపోవడం వంటి ఆరోపణలు ఉన్నాయన్నారు. డీలర్లు నిబంధనల ప్రకారం రేషన్‌ పంపిణీ చేయాలని ఆదేశించారు. డీలర్లకు ప్రస్తుతం ఇస్తున్న కమిషన్‌ను పెంచే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అంగన్వాడీ కేంద్రాల్లోనూ ప్రభుత్వ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతున్నదీ లేదో పరిశీలిస్తున్నామని చెప్పారు.ప్రభుత్వం కిలో రేషన్‌ బియ్యాన్ని రూ.45కు కొనుగోలు చేస్తోందని కార్డుదారులు బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీలర్లు రేషన్‌ బియ్యాన్ని విక్రయించరాదని స్పష్టం చేశారు.

Ram Mohan, Singarayakonda

Ram Mohan, Singarayakonda

Next Story