Nellore: థ్యాంక్ యూ సీఎం సార్: నెల్లూరులో ఏపీ జేఏసీ హర్షం!

Nellore: 12వ పీఆర్సీ ఛైర్మన్ నియామకం, ఈహెచ్ఎస్ క్రమబద్ధీకరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం చంద్రబాబుకు నెల్లూరు ఏపీ జేఏసీ ధన్యవాదాలు తెలిపింది.

A Praveen, Nellore
Published on: 7 Sept 2026 12:08 AM IST
Nellore
X

Nellore: థ్యాంక్ యూ సీఎం సార్: నెల్లూరులో ఏపీ జేఏసీ హర్షం!

నెల్లూరు: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న కీలక నిర్ణయాలపై ఏపీ జేఏసీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఛైర్మన్ బండారుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు,ఉద్యోగ,ఉపాధ్యాయ,మహిల విభాగ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు వారికి ఎంతో ప్రయోజనం చేకూర్చనున్నాయని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జేఏసీ చైర్మన్ బండారుపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా జేఏసీ సెక్రటరీ అల్లంపాటి సురేంద్ర రెడ్డి గార్లు తెలిపారు.

ముఖ్యమంత్రి ఉద్యోగుల సమస్యలపై తీసుకున్న నిర్ణయాలు

12వ PRC చైర్మన్ నియామకానికి అంగీకారం. రెండు డీఏలను 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లించేందుకు నిర్ణయం. 01-07-2024, 01-01-2025 డీఏలను విడుదల చేసేందుకు అంగీకారం. 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్‌లను వచ్చే సంక్రాంతి నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయం.

పోలీసులకు ఒక అదనపు సరెండర్ లీవ్‌ను ఈ దసరాకు చెల్లించేందుకు అంగీకారం. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను 2027 జనవరి నుంచి అమలు చేసేందుకు నిర్ణయం. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింపజేయాలని నిర్ణయం.

ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS)ను క్రమబద్ధీకరించడంతో పాటు, వచ్చే నెల నుంచి ప్రతి నెలకు సంబంధించిన చెల్లింపును అదే నెలలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌కు చెల్లించేందుకు అంగీకారం.

ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిగణించి, ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర ప్రభుత్వానికి , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జేఏసీ తరఫున హర్షం వ్యక్తం చేశారు

ఈ కార్యక్రమంలోకిరణ్ కుమార్ జి రామకృష్ణ L పెంచలయ్య ఆంజనేయ వర్మ నరసింహం, రాజేంద్రప్రసాద్ సురేష్ సతీష్, వీరబ్రహ్మేశ్వరరావు, నవోదయ, గురవయ్య పిచ్చి బాబు తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story