Nellore: ఏపీలో ఉధృతమైన జూనియర్ డాక్టర్ల ఆందోళన, సమ్మె
Nellore: ఏపీలో మరింత ఉధృతమైన జూనియర్ డాక్టర్ల ఆందోళన. డిమాండ్ల పరిష్కారం కోసం ఇవాళ అత్యవసర సేవల బహిష్కరణ. పాల్గొన్న సీపీఐ నేతలు.
Nellore: ఏపీలో ఉధృతమైన జూనియర్ డాక్టర్ల ఆందోళన, సమ్మె
నెల్లూరు: ఏపీలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతమైంది...తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ... జూలై నుంచి ప్రభుత్వంతో చర్చలతో జరుగుతున్న ప్రయోజనం లేకపోయిందంటూ.. ఇవాళ జూనియర్ డాక్టర్లు అత్యవసర విధుల నుంచి బయటకు వచ్చారు ఎప్పటి వరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ.. రోగులకు ఇబ్బందులు లేకుండా తాము ఆందోళన చేస్తున్నప్పటికీ... ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ అత్యవసర విభాగ సేవలను బహిష్కరించినట్లు జూనియర్ డాక్టర్ల నాయకులు చెప్పారు.
రాష్ట్రంలో, దేశంలో పెరుగుతున్న కనీస ధరలు కనీస అవసరాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 30% స్టఫ్ అండ్ పెంచాలని తాము చేసిన ప్రతిపాదనపై స్పందించలేదని, జూనియర్ డాక్టర్లు చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సానుకూల ధోరణితో తమ న్యాయమైన కోరికలను అంగీకరించాలని డాక్టర్లు చెప్పారు.. అందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, నెల్లూరు జిల్లా ఇంచార్జ్ కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్, అరిగెల సాయి సిపిఐ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి పలువురు నాయకులు పాల్గొన్నారు.




