Nellore: భావితరాల కోసం ‘మనసు ఫౌండేషన్’ అక్షర యజ్ఞం
Nellore: ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ వరికుంటపాడు మండలం కనియంపాడులోని 'మనసు ఫౌండేషన్'ను సందర్శించారు.
Nellore: భావితరాల కోసం ‘మనసు ఫౌండేషన్’ అక్షర యజ్ఞం
Nellore: భావితరాలకు ఉపయోగపడేలా పురాతన మరియు నూతన పాఠ్య పుస్తకాలను డిజిటలైజేషన్ చేయడం గొప్ప విషయం అన్నారు మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్. సుమారుగా ఇప్పటివరకు 15000 పైచిలుకు పుస్తకాలను డిజిటల్ డిజిటలైజేషన్ చేయడం జరిగిందని చెప్పారు.
మనసు ఫౌండేషన్ ప్రతినిధి రాయుడు సేవలు ప్రశంసనీయని కొనియాడారు ఆలపాటి సురేష్. మంగళవారం ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ వరికుంటపాడు మండలం కనియంపాడు వద్దగల మనసు ఫౌండేషన్ ను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మనసు ఫౌండేషన్ ప్రతినిధి రాయుడుతో మాట్లాడుతూ..
ఎప్పటి నుంచి ఇక్కడ ఫౌండేషన్ నడుస్తోంది..? ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు..? ఇప్పటికి ఎన్ని పుస్తకాలు సేకరించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.. పురాతన మరియు నూతన పాఠ్యపుస్తకాలను సిటిలైజేషన్ చేయడం ద్వారా భావితరాలకు ఎంతో ఉపయోగకరమని ఆయన ఆశా భావాన్ని వ్యక్తపరిచారు. ఈ విషయమై మనసు ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.
సుమారుగా 15000 పైచిలుకు పాఠ్యపుస్తకాలను ఇతరములను డిజిటలైజేషన్ చేయడం సంతోషదాయకమని ఆయన అభివర్ణించారు. మనసు ఫౌండేషన్ మొత్తం కలియ తిరిగి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్యాకింగ్ వ్యవస్థ, స్కానింగ్ వ్యవస్థ, మరియు డిజిటలైజేషన్ ను ప్రత్యక్షంగా పరిశీలించి సంతోషాన్ని వ్యక్తపరిచారు.
మనసు ఫౌండేషన్ ప్రతినిధి రాయుడు మాట్లాడుతూ మార్చి -18,2018 నుండి మనసు ఫౌండేషన్ తమ కార్యకర్తలను ప్రారంభించిందని ఆయన తెలిపారు. ప్రత్యక్షంగా సుమారు 30 మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. దాతలు ఎవరైనా తమ వద్ద ఉన్న పురాతన మరియు నూతన పుస్తకాలను మనసు ఫౌండేషన్ కి అందజేసి డిజిటలైజేషన్ ప్రక్రియకు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ ప్రతినిధులు భాస్కర్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.




