Nellore: రెడ్‌క్రాస్ గోల్డ్ మెడల్ సాధించిన నెల్లూరు కలెక్టర్‌కు అభినందనలు!
Nellore: రెడ్‌క్రాస్ విశేష సేవలకు గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ నేతలు కలసి అభినందించారు.
Nellore: రెడ్‌క్రాస్ గోల్డ్ మెడల్ సాధించిన నెల్లూరు కలెక్టర్‌కు అభినందనలు!
Nellore: నెల్లూరు జిల్లా ఐఆర్సీఎస్ శాఖ విశేష సేవలకు 2,097 మంది లైఫ్ మెంబర్ల నమోదు మరియు 15,747 యూనిట్ల రక్తం సేకరణకు సంబందించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) నెల్లూరు జిల్లా శాఖ అందించిన విశేష సేవలు, సాధించిన ప్రగతికి గుర్తింపుగా సెప్టెంబర్ 1వ తేదీన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్ హిమాన్షు శుక్లా గారు గోల్డ్ మెడల్‌ను అందుకున్నందున ఏపీ. ఎన్. జి. జి. వోస్ అసోసియేషన్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షులు బండారుపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి గాదిరాజు రామకృష్ణ ఆధ్వర్యంలో మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు వారిని, మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి కిరణ్ కుమార్ అసోసియేట్ అధ్యక్షులు ఎన్ ఆంజనేయ వర్మ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్ పెంచలయ్య ఉపాధ్యక్షులు కే రాజేంద్రప్రసాద్ పి సతీష్ బాబు టి మల్లికార్జునరావు ఈ కరుణమ్మ జాయింట్ సెక్రెటరీ సిహెచ్ వీరబ్రహ్మేశ్వరరావు కే సురేష్ ఎం రాజేంద్ర పి రమ్య కోశాధికారి వీఎంవి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




