Nellore: మీలాద్-ఉన్-నబీ శాంతి ర్యాలీలో పాల్గొన్న ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్

Nellore: పవిత్ర మీలాద్-ఉన్-నబీ సందర్భంగా నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొన్న ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్.

V. Narasimhulu, Nellore
Published on: 26 Aug 2026 11:00 PM IST
Nellore
X

Nellore: మీలాద్-ఉన్-నబీ శాంతి ర్యాలీలో పాల్గొన్న ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్

నెల్లూరు: పవిత్ర మీలాద్-ఉన్-నబీ సందర్భంగా నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, సహనం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో మత సామరస్యాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

మీలాద్-ఉన్-నబీ వేడుకలు కేవలం ఒక మతపరమైన కార్యక్రమంగా కాకుండా, సమాజంలో శాంతి, ఐక్యత, సోదరభావాన్ని చాటిచెప్పే సందర్భంగా నిలవాలని అబ్దుల్ అజీజ్ ఆకాంక్షించారు.

శాంతి ర్యాలీలో మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మీలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story