Nellore: ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జన్మదిన వేడుకలు: గజమాలతో సత్కరించిన అభిమానులు!

Nellore: ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జన్మదిన వేడుకలు నెల్లూరులోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 May 2026 8:54 PM IST
Nellore
X

Nellore: ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జన్మదిన వేడుకలు: గజమాలతో సత్కరించిన అభిమానులు!

నెల్లూరు: ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, నగరంలోని హరనాథపురంలో గల ఆయన నివాసంలో, జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ గజమాల తో అజీజ్ ను సత్కరించి, కేక్ కట్ చేయించారు. జిల్లా నలుమూలల నుంచి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ...ఏ పదవి వచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చి పెట్టిన ఘన చరిత్ర ఉందని అబ్దుల్ అజీజ్ ను కొనియాడారు. ప్రస్తుతం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఉన్న ఆయన భారత దేశ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ముస్లిం విద్యార్థుల కోసం విద్యా పథకాన్ని అమలుచేస్తున్నారని, ఏపీ వక్ఫ్ బోర్డ్ పేరును దేశ వ్యాప్తంగా చర్చింకునే విధంగా చేశారని అన్నారు. 52 వ డివిజన్ లో ఇక్బాల్, పాషా మొహిద్దిన్ ల ఆధ్వర్యంలో అబ్దుల్ అజీజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి లు అజీజ్ ను ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెన్నీ రమణయ్య, పెంచల నాయుడు, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, ప్రశాంత్, జహీర్, ఇంతియాజ్, కరిముల్లా, మాతంగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story